Geetha Arts: లాభాలే లక్ష్యం… రూటు మార్చిన గీతా ఆర్ట్స్!

గతంలో గీత ఆర్ట్స్ చిన్న సినిమాలకు సపోర్ట్ ఇచ్చిన అవన్నీ లాస్ వెంచర్స్ గా మిగిలాయి. కానీ బేబీ సినిమా మాత్రం ఊహించని లాభాలు తెచ్చిపెట్టింది. దీంతో మున్ముందు కూడా చిన్న సినిమాలకు గీతా ఆర్ట్స్ సపోర్ట్ ఇవ్వబోతుంది.

Written By: Shiva, Updated On : August 14, 2023 1:26 pm

Geetha Arts

Follow us on

Geetha Arts: టాలీవుడ్ లో ఒక్కప్పుడు చిన్న సినిమాల పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. సినిమాలో మంచి విషయం ఉన్న కానీ ఆ సంగతి బయటకు తెలిసేలోపే ఆ సినిమా రన్ దాదాపుగా ఆగిపోతుంది. కానీ నేడు ఆ పరిస్థితి మారిపోయింది. సినిమాలో మంచి విషయం ఉందని తెలిస్తే చాలు మ్యాట్నీ షో కి థియోటర్లు ఫుల్ అవుతాయి. పైగా ఎలాగూ OTT ఉంది. దీంతో చిన్న నిర్మాతలు ధైర్యంగా ముందుకు వస్తున్నారు.

ఈ క్రమంలో టాప్ ప్రొడక్షన్ హౌస్ గా పేరుపొందిన గీతా ఆర్ట్స్ ఇప్పటికే చిన్న సినిమాల వైపు ఫోకస్ చేసింది. రీసెంట్ గా సూపర్ హిట్ అయిన బేబీ సినిమా కి బ్యాక్ ఎండ్ లో సపోర్ట్ ఇచ్చింది గీత ఆర్ట్స్. ఎప్పుడయితే సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుందో వెంటనే మెయిన్ లైన్ లోకి వచ్చేసి, అల్లు అర్జున్, మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్స్ ను రంగంలోకి దించి సినిమా ప్రమోషన్స్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్ళింది.

ఈ సినిమా కి పెట్టుబడి పెట్టిన గీత ఆర్ట్స్ OTT హక్కుల రూపంలో ఆ పెట్టుబడిని వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత వచ్చిన ప్రతి రూపాయి లాభాల్లో 60 పైసలు తీసుకుంది. గతంలో గీత ఆర్ట్స్ చిన్న సినిమాలకు సపోర్ట్ ఇచ్చిన అవన్నీ లాస్ వెంచర్స్ గా మిగిలాయి. కానీ బేబీ సినిమా మాత్రం ఊహించని లాభాలు తెచ్చిపెట్టింది. దీంతో మున్ముందు కూడా చిన్న సినిమాలకు గీతా ఆర్ట్స్ సపోర్ట్ ఇవ్వబోతుంది.

ఇలా చేయడం వలన గీతా ఆర్ట్స్ కు లాభం తప్ప, నష్టం ఎక్కడ లేదు. సినిమా ఏదైనా తేడా కొడితే ఎలాగూ సొంత OTT ఉంది కాబట్టి, ఆ రైట్స్ తీసుకుని తప్పుకుంటుంది. ఎక్కడ కూడా గీతా ఆర్ట్స్ పేరు కనిపించదు. అదే కనుక సినిమా హిట్ అయితే మాత్రం రంగంలోకి దిగి పబ్లిసిటీ చేసి, లాభాలు తీసుకుంటుంది. ఈ ఫార్ములా వలన వచ్చే నష్టమేమి లేకపోవటంతో అల్లు అరవింద్ సారథ్యంలో బన్నీ వాసు పర్యవేక్షణలో చిన్న సినిమాల మీద ఫోకస్ పెట్టింది గీతా ఆర్ట్స్. ఇందులో భాగంగా ఇప్పటికే నాలుగు చిన్న సినిమాలకు ఆర్థిక సాయం చేయబోతుంది ఈ సంస్థ