Ram charan : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నారు. మరి ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకోడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న ఈ స్టార్ హీరోలు వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నారు… దానికి అనుగుణంగానే మన యంగ్ హీరోలు మాస్ హీరో రేంజ్ ను టచ్ చేసే సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదగడానికి కొన్ని క్యాలిక్యులేషన్స్ అయితే ఉన్నాయి.హీరో భారీగా మాస్ ఎలిమెంట్స్ తో కూడిన సినిమాలను చేయాల్సి ఉంటుంది. ఆ సినిమా సూపర్ సక్సెస్ అయి భారీ కలెక్షన్లను కొల్లగొట్టాల్సిన అవసరమైతే ఉంది. ఇక సాఫ్ట్ సినిమాలు చేసుకుంటూ వెళ్తే ఎంతసేపు మీడియం రేంజ్ హీరోలు గానే ఉంటారు తప్ప స్టార్ హీరో రేంజ్ అయితే టచ్ చేయలేరు. కాబట్టి భారీ ఎమోషన్స్, ఎలివేషన్స్ తో కూడిన సినిమాలను చేయడానికి హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. తద్వారా వాళ్ళు స్టార్ హీరోలుగా ఎదగడమే కాకుండా వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకున్న వాళ్ళు అవుతున్నారు…అయితే ఇండస్ట్రీలో మాస్ హీరోగా ఎదగాలంటే ఆ హీరోకి తప్పనిసరిగా గడ్డం ఉండాలి అంటూ చాలామంది సినిమా మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు మాస్ సినిమాలను చేసిన ప్రతి ఒక్కరు గడ్డంతో మెయింటెన్ చేస్తూ వచ్చిన వారే కావడం విశేషం…
రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ దగ్గర నుంచి ఇప్పుడు బచ్చల మల్లి సినిమాతో అల్లరి నరేష్ వరకు ప్రతి ఒక్కరు మాస్ ఎలిమెంట్స్ చూపించాలి అంటే వాళ్లకు తప్పనిసరిగా గడ్డం ఉండాల్సిందే అని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు. ఇక పుష్ప సినిమాలో అల్లు అర్జున్ భారీ గడ్డంతో తగ్గేదేలే అనడంతోనే ఒక్కసారిగా ఆయన భారీ మాస్ ఇమేజ్ నైతే సాధించుకున్నాడు.
మరి ఇప్పుడు ఆ రేంజ్ లోనే మిగతా హీరోలు కూడా మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నం చేస్తున్నారా అంటూ కొన్ని కామెంట్లైతే వెలువడుతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా గడ్డం మీసాలు పెంచితే మాస్ ఇమేజ్ అనేది రాదు. కథలో కంటెంట్ ఉంటేనే మాస్ హీరోగా ఎలివేట్ అవుతారు తప్ప అంతకుమించి బయట అప్పీరెన్స్ ఎంతలా ఉన్నా కూడా ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాయేమో కానీ సక్సెస్ లు మాత్రం సాధించడం చాలా కష్టమనే చెప్పాలి.
ఇక హీరోల బాడీ వేరియేషన్స్ ను చూపించడంలో తప్పులేదు. కానీ కథ లో కంటెంట్ ఉంటేనే సినిమా అనేది సక్సెస్ సాధిస్తుంది. ఇక నాని కూడా దసర సినిమాలో భారీ గడ్డాన్ని పెంచుకొని సినిమాలో మాస్ ఎలిమెంట్స్ తో కూడిన ఫైట్ సీన్స్ ని భారీగా చేశాడు. ఇక ఆయనకు ఆ సినిమా మంచి విజయాన్ని సాధించి పెట్టడంతో ఇప్పుడు ఆయన వరుసగా మాస్ సినిమాలు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది…