https://oktelugu.com/

బిగ్ బాస్ చెక్ తో బంగారం కొన్న గంగవ్వ.. ఎంత ఇచ్చారో తెలుసా?

మారుతున్న ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ వల్ల మానవ జాతికి ఎంత ఉపయోగం ఉంది. సరిగ్గా ఉపయోగించుకోవాలేగాని తల రాతని పూర్తిగా మార్చేసుకోవచ్చు. యూట్యూబ్, టిక్ టాక్ , సోషల్ మీడియా వంటి మాద్యమాలు ఎంతో మందికి జీవనోపాధిని కల్పిస్తున్నాయి. అవకాశాన్ని ఉపయోగించుకొని మంచి క్రేజ్ అందుకుంటున్న వారు ఇప్పుడు స్టార్ సెలబ్రెటీస్ కంటే ఎక్కువగా ఫేమస్ అయ్యారు. గంగవ్వ… ఈవిడ తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండరేమో. మై విలేజ్ షో ” అనే […]

Written By:
  • admin
  • , Updated On : December 17, 2020 / 07:24 PM IST
    Follow us on


    మారుతున్న ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ వల్ల మానవ జాతికి ఎంత ఉపయోగం ఉంది. సరిగ్గా ఉపయోగించుకోవాలేగాని తల రాతని పూర్తిగా మార్చేసుకోవచ్చు. యూట్యూబ్, టిక్ టాక్ , సోషల్ మీడియా వంటి మాద్యమాలు ఎంతో మందికి జీవనోపాధిని కల్పిస్తున్నాయి. అవకాశాన్ని ఉపయోగించుకొని మంచి క్రేజ్ అందుకుంటున్న వారు ఇప్పుడు స్టార్ సెలబ్రెటీస్ కంటే ఎక్కువగా ఫేమస్ అయ్యారు. గంగవ్వ… ఈవిడ తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండరేమో. మై విలేజ్ షో ” అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫోకస్ అయ్యింది. ఆ తర్వాత అనూహ్య రీతిలో బిగ్ బాస్ షోలో అడుగుపెట్టి అమాంతంగా తెలుగు ప్రజల మనసులో స్థానం ఏర్పరచుకుంది. ఏ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.షో లో ఎక్కువ కాలం లేకపోయినప్పటికీ ఉన్నంతకాలం బాగానే వినోదం పంచింది.

    Also Read: హిరణ్య కశ్యపకు త్రివిక్రమ్ మాటలు.. ?

    ఇప్పుడు గంగవ్వ గురించి మాట్లాడుకోవాల్సిన విశేషమేమిటంటే… ఆమెకి బిగ్ బాస్ షో నుండి రెమ్యూనరేషన్ చెల్లింపులుకుగాను చెక్కులు అందించారు. అప్పుడు గెలిచిన చెక్కులు ఇటీవల అందడంతో బంగారం కొనేందుకు హైదరాబాద్ కు వచ్చింది. ఒక లక్ష రూపాయల బంగారంను కూడా కొనుగోలు చేసింది. అందుకు సంబంధించిన వీడియోను కూడా గంగవ్వ తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేసింది. స్పెషల్ గా లక్ష రూపాయల బంగారంను కూడా కొనుగోలు చేసింది.ఆ తరవాత ఇంటికెళ్లిన గంగవ్వ తన ఛానల్ పార్టనర్ లు అనిల్ అండ్ రాజుతో ముచ్చటిస్తూ ఇంకా కొంత బంగారం కొనాలని , ఇల్లు కట్టిన తరువాత పెద్ద గేట్ పెట్టి కార్ కూడా కొనాలని చెప్తుంది.

    Also Read: వారికీ 19, 20 ఏళ్ల వయసు భామలే కావాలి !

    బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యినప్పుడు స్టేజి మీద నాగార్జునతో మాట్లాడుతున్న సందర్బంలో తనకు ఇల్లు లేదని, ఇల్లు కట్టుకోవాలని తన మనసులో మాటని బయట పెట్టగా తప్పకుండా ఇల్లు కట్టిస్తామని నాగార్జున హామీ కూడా ఇవ్వడంతో అప్పటి నుంచి ఈ న్యూస్ వైరల్ గా మారింది. గంగవ్వకిచ్చిన మాట ప్రకారం త్వరగా ఇంటిని కట్టించి ఇవ్వాలని చూస్తున్నారట. ఇల్లు కట్టిన తర్వాత గంగవ్వ ఇల్లుపై కూడా వీడియో చేసి తన ఛానల్ లో పెట్టాలనుకుంటుందట. ఎటువంటి కల్మషంలేని గంగవ్వకి అంతా మంచి జరగాలని కోరుకుందాం.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్