https://oktelugu.com/

Game Changer : ‘గేమ్ చేంజర్’ ట్రైలర్ విడుదల వాయిదా..కారణాలు ఇవే..ఆవేశంతో ఊగిపోతున్న రామ్ చరణ్ ఫ్యాన్స్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'గేమ్ చేంజర్' చిత్రం మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : December 31, 2024 / 10:15 AM IST

    Game Changer

    Follow us on

    Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ చిత్రం మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ సినిమా మేనియా నే కనిపిస్తుంది. రీసెంట్ గా విజయవాడ లో రామ్ చరణ్ కటౌట్ లాంచ్ ఈవెంట్ ఎంత గ్రాండ్ గా జరిగిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రపంచంలోనే అత్యంత భారీ కటౌట్ గా రామ్ చరణ్ ఫ్యాన్స్ చరిత్ర సృష్టించారు. ఇలా ఇప్పటి వరకు కేవలం అభిమానులే ఈ సినిమాకి హైప్ ని పెంచేందుకు ప్రయత్నం చేస్తూ వస్తున్నారు కానీ, మూవీ టీం మాత్రం ప్రొమోషన్స్ చేయడం లేదంటూ సోషల్ మీడియా లో అభిమానులు తీవ్రమైన నిరాశని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా థియేట్రికల్ ట్రైలర్ విడుదల కోసం అభిమానులు ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ థియేట్రికల్ ట్రైలర్ మీద ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఆధారపడి ఉంది.

    అయితే విజయవాడ లోని కటౌట్ లాంచ్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు, థియేట్రికల్ ట్రైలర్ ని జనవరి 1 న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. ఈ ట్రైలర్ ని కూడా ఎదో సింపుల్ గా విడుదల చేయకుండా, హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పెరేడ్ గ్రౌండ్స్ లో ఒక భారీ ఈవెంట్ ని ఏర్పాటు చేసి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదే విధంగా మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథులుగా పాల్గొంటారని ప్రచారం జరిగింది. అయితే ఈ ట్రైలర్ ని జనవరి 1న కాకుండా రెండవ తేదీన విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నట్టు లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం. టీజర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి సంబంధించి ఫైనల్ మిక్సింగ్ ఇంకా బ్యాలన్స్ ఉందట. అభిమానులకు మరింత బెస్ట్ అనుభూతి ని అందించేందుకు ఒక్క రోజు ఆలస్యంగా ఈ ట్రైలర్ విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

    ఈ ప్రచారం సోషల్ మీడియా లో జరగగానే అభిమానులు నిర్మాత దిల్ రాజు మరియు మూవీ టీం పై చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సినిమాకి కొత్తగా హైప్ రప్పించడం కాదు, ఉన్న హైప్ ని కూడా చెడగొట్టేస్తున్నారు. పది రోజుల్లో సినిమా విడుదలని పెట్టుకొని ఇప్పటి వరకు థియేట్రికల్ ట్రైలర్ లేదు. ఎప్పుడు విడుదల చేస్తారో సరైన క్లారిటీ కూడా లేదంటూ పెదవి విరుస్తున్నారు. ఓవర్సీస్ వంటి ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ముఖ్యంగా థియేట్రికల్ ట్రైలర్ ని చూసే జరుగుతాయి. ఎందుకంటే అక్కడి ఆడియన్స్ ఒక సినిమాకి వెళ్లాలా?, వద్దా? అనేది ట్రైలర్ ని చూసే నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటి వరకు ఓవర్సీస్ లో 5 లక్షల 50 వేల డాలర్ల అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రమే జరిగింది. రామ్ చరణ్ రేంజ్ కి ఇది చాలా తక్కువ. ట్రైలర్ విడుదల అయ్యాక కచ్చితంగా బుకింగ్స్ బాగా పెరిగే అవకాశం ఉందని అక్కడి ట్రేడ్ పండితులు అంటున్నారు.