https://oktelugu.com/

Pushpa 2 : 26 రోజులు నాన్ స్టాప్ గా ‘కోటి’ రూపాయిలు..’పుష్ప 2′ ఖాతాలో మరో ప్రపంచ రికార్డు..ఇదేమి కొట్టుడు సామీ!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' చిత్రం విడుదలై 26 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 26 రోజుల్లో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రాబట్టిన వసూళ్లు ఎలా ఉన్నాయో మనం కళ్లారా చూస్తున్నాము.

Written By:
  • Vicky
  • , Updated On : December 31, 2024 / 10:11 AM IST

    Pushpa 2

    Follow us on

    Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రం విడుదలై 26 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 26 రోజుల్లో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రాబట్టిన వసూళ్లు ఎలా ఉన్నాయో మనం కళ్లారా చూస్తున్నాము. హై బడ్జెట్ గ్రాఫిక్స్ ఉన్న సినిమాలకు తప్ప, ఇండియా లో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టడం అంత తేలిక కాదు అనే వాదన ఉండేది. అది పూర్తిగా అసత్యం, కమర్షియల్ సినిమాలను పర్ఫెక్ట్ గా తీస్తే బాక్స్ ఆఫీస్ వద్ద కళ్ళు చెదిరే వసూళ్లు వస్తాయి, అద్భుతాలు జరుగుతాయి అంటూ ఈ చిత్రం తో నిరూపణ అయ్యింది. మొదటి వారం లోనే వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమా, ఇప్పుడు 2000 కోట్ల రూపాయిల వైపు దూసుకుపోతుంది. 25 రోజులకు గానూ 1760 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టినట్టు నిర్మాతలు ఒక పోస్టర్ ని విడుదల చేసారు.

    ఇప్పటి వరకు ఎన్నో అరుదైన రికార్డ్స్ ని నెలకొల్పిన ఈ చిత్రం ఖాతాలో మరో సంచలన రికార్డు నమోదు అయ్యింది. విడుదలైన రోజు నుండి నేటి వరకు ఈ సినిమాకి ప్రతీ రోజు తెలుగు రాష్ట్రాల్లో కోటి రూపాయలకు తగ్గకుండా థియేట్రికల్ షేర్ వచ్చింది. #RRR చిత్రానికి 17 రోజులు ఇలా నాన్ స్టాప్ గా కోటి రూపాయలకు పైగా షేర్ రాగా, ‘పుష్ప 2 ‘ చిత్రానికి 26 రోజులు నాన్ స్టాప్ గా వచ్చింది. రేపు కూడా ఇదే రేంజ్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా బుక్ మై షో యాప్ లో 26 వ రోజు ఈ చిత్రానికి లక్షల 20 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి రెండు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రాగా, నార్త్ ఇండియా 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచింది.

    ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 26 వ రోజు ఈ చిత్రానికి 14 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. నిన్నటితో ఈ చిత్రం నార్త్ అమెరికా లో 15 మిలియన్ల గ్రాస్ వసూళ్ల మార్కుని అందుకుంది. ఇప్పటి వరకు మన తెలుగు సినిమాలలో బాహుబలి 2 , కల్కి చిత్రాలు మాత్రమే ఈ క్లబ్ లోకి చేరాయి. నిన్నటితో ‘పుష్ప 2 ‘ చిత్రం కూడా ఆ ఎలైట్ క్లబ్ లోకి చేరింది. నార్త్ అమెరికా లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని పొందాలంటే మరో 1 మిలియన్ డాలర్లను రాబట్టాలి. ‘గేమ్ చేంజర్’ చిత్రం వరకు ఈ సినిమా థియేట్రికల్ రన్ ఉంటుంది కాబట్టి, మరో 1 మిలియన్ గ్రాస్ ని రాబట్టి బ్రేక్ ఈవెన్ ని సాధించొచ్చు అని అంటున్నారు ట్రేడ్ పండితులు.