Game Changer: రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫుల్ డిసప్పాయింట్ లో ఉన్నారు. గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ అనుకున్నట్లు సాగకపోవడమే దీనికి కారణం. ఆ మధ్య రామ్ చరణ్ అభిమాని ఒకరు దిల్ రాజుకు సూసైడ్ నోట్ రాశారు. గేమ్ ఛేంజర్ అప్డేట్ ఇవ్వకపోతే చచ్చిపోతా… నా చావుకు మీరే కారణం అవుతారంటూ బెదిరింపులకు దిగాడు. రామ్ చరణ్ ఫ్యాన్ సూసైడ్ నోట్ వైరల్ అయ్యింది. గేమ్ ఛేంజర్ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా భారతీయుడు 2 ప్రాజెక్ట్ డిస్టర్బ్ చేసింది.
విక్రమ్ మూవీ సక్సెస్ తో కమల్ హాసన్ ఫార్మ్ లోకి వచ్చాడు. దాంతో వివాదాలతో ఆగిపోయిన భారతీయుడు 2 ప్రాజెక్ట్ ని నిర్మాతలు తెరపైకి తెచ్చారు. దర్శకుడు శంకర్ తో సయోధ్య కుదుర్చుకుని నిర్మాతలు షూటింగ్ పట్టాలెక్కించారు. భారతీయుడు 2 చిత్రీకరణపై పూర్తి దృష్టి పెట్టిన శంకర్ గేమ్ ఛేంజర్ షూటింగ్ ఏదో మొక్కుబడిగా చేస్తున్నాడు.
గేమ్ ఛేంజర్ చిత్రీకరణ శంకర్ అసిస్టెంట్స్ తో లాగిస్తున్నారనే వాదన కూడా ఉంది. ఈ క్రమంలో ఫ్యాన్స్ లో అసహనం నెలకొంది. అసలు గేమ్ ఛేంజర్ ఇప్పుడు విడుదల అవుతుందనే సందేహాలు అభిమానుల మనసులు తొలిచేస్తున్నాయి. ఈ క్రమంలో ఫ్యాన్స్ శాంతించే మాట దిల్ రాజు నోటి నుండి వచ్చింది. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ పై దిల్ రాజు హింట్ ఇచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన గేమ్ ఛేంజర్ 2024 సెప్టెంబర్ లో విడుదల కానుందని అన్నారు.
దాంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. గేమ్ ఛేంజర్ పొలిటికల్ థ్రిల్లర్. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఎన్నికల అధికారికగా, రాజకీయ నాయకుడిగా రెండు భిన్నమైన షేడ్స్ ఆయన పోషిస్తున్నారని సమాచారం. కియారా అద్వానీ మరోసారి రామ్ చరణ్ తో జతకడుతుంది. అంజలి, సునీల్, శ్రీకాంత్ కీలక రోల్స్ చేస్తున్నారు.