Salaar Collection: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సీజ్ ఫైర్ సినిమా తమదైన రీతిలో సక్సెస్ ను చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా రిలీజ్ కి ముందు కొంత మంది కావాలని నెగిటివ్ ప్రచారం చేసినప్పటికీ ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ను అందుకుంటూ మంచి సక్సెస్ ను సాధించింది.
ఇక ఇప్పుడు కలక్షన్ల వేట కొనసాగిస్తుంది ఇప్పటికే ఈ సినిమా రెండు రోజుల్లో దాదాపు 300 కోట్ల వరకు కలక్షన్లు రాబట్టి సినిమా ఇండస్ట్రీలోనే సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది. ఇక ఈ సినిమా తో ప్రభాస్ ఒక భారీ సక్సెస్ ని సాధించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు.పాన్ ఇండియా రేంజ్ లో మరొకసారి తన సత్తా చాటుకున్నాడు బాలీవుడ్ హీరోలకు కూడా సొంతం కాని రీతిలో సక్సెస్ ను అందుకుంటూ ప్రభాస్ మరోసారి బాక్స్ ఆఫీస్ మీద తన పంజా విసిరాడు. ఇక ఈ సినిమాతో పోటీకి వచ్చిన షారుక్ ఖాన్ డంకి సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమా ని బీట్ చేస్తూ సలార్ సినిమా కొత్త రికార్డు క్రియేట్ చేస్తుంది.
సలార్ సినిమా రిలీజ్ వరకు కూడా షారుక్ ఖాన్ డంకి సినిమా మీదనే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి ఎందుకంటే ఆ సినిమా డైరెక్టర్ అయిన రాజ్ కుమార్ హిరానీ కి ఇప్పటి వరకు తీసిన అన్ని సినిమాలు వరుస సక్సెస్ లను అందుకున్నాడు. ఇక దానికి తోడుగా షారుఖ్ ఖాన్ వరుసగా రెండు సినిమాలతో వెయ్యి కోట్లకు పైన కలక్షన్స్ ని రాబట్టాడు. కాబట్టి ఈ సినిమా పైన ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండేవి కానీ ఒక్కసారి డంకి సినిమా రిలీజ్ అయి ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో అందరి దృష్టి సలార్ మీద పడింది. ఇక ప్రభాస్ అద్భుతమైన నటనకి అలాగే ప్రశాంత్ నీల్ డిఫరెంట్ మేకింగ్ కి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ఇక ఇప్పుడు ఈ సినిమా 1000 కోట్ల కి పైన కలక్షన్స్ ని రాబడుతుందని టాక్ అయితే వినిపిస్తుంది.కేవలం రెండు రోజులకే 300 కోట్ల పైన వసూలను రాబట్టిన ఈ సినిమా లాంగ్ రన్ లో సంచనలను క్రియేట్ చేస్తుంది అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…