https://oktelugu.com/

Game Changer: సౌత్ ఇండియాలోనే ఆల్ టైం రికార్డు నెలకొల్పిన గేమ్ చేంజర్ ‘రా మచ్చ మచ్చ’ సాంగ్..24 గంటల్లో ఎన్ని వ్యూస్ వచ్చాయంటే!

జరగండి..జరగండి' విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. యూట్యూబ్ లో ఈ పాటకు దాదాపుగా 44 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. నిన్న ఈ సినిమాకి సంబంధించిన రెండవ పాట 'రా మచ్చ మచ్చ' ని విడుదల చేసారు.

Written By:
  • Vicky
  • , Updated On : October 1, 2024 / 04:13 PM IST

    Game Changer(3)

    Follow us on

    Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. మేకర్స్ ఈ చిత్రాన్ని క్రిస్మస్ కి విడుదల చేయాలా?, లేకపోతే సంక్రాంతికి విడుదల చేయాలా అనే చిన్న కన్ఫ్యూజన్ లో ఉన్నారు. నిన్న మొన్నటి వరకు ఈ చిత్రాన్ని డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు డిసెంబర్ 25 న విడుదల చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెండు తేదీలు కాకుండా సంక్రాంతికి విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో కూడా ఉన్నారు మేకర్స్. ఇంకా ఏది ఖరారు కాలేదు, ఈ దసరా పండుగ రోజున విడుదల తేదీ పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

    ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో ఇప్పటికే మొదటి పాట ‘జరగండి..జరగండి’ విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. యూట్యూబ్ లో ఈ పాటకు దాదాపుగా 44 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. నిన్న ఈ సినిమాకి సంబంధించిన రెండవ పాట ‘రా మచ్చ మచ్చ’ ని విడుదల చేసారు. ఈ పాటకు అభిమానుల నుండి, మూవీ లవర్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం 24 గంటల్లో సౌత్ లోనే అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకున్న పాట ఇదేనని అంటున్నారు. 24 గంటల్లో ‘రా మచ్చ మచ్చ’ పాటకు యూట్యూబ్ లో 16 మిలియన్ కి పైగా వ్యూస్, 3 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయట. నిన్న మొన్నటి వరకు అత్యధిక వ్యూస్ ని సాధించిన పాట గా ‘దేవర’ చిత్రం నుండి ‘చుట్టమల్లే’ సాంగ్ నిల్చింది. 24 గంటల్లో ఈ పాటకు 15 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి.

    ఆ తర్వాత అల్లు అర్జున్ ‘పుష్ప 2 ‘ చిత్రం లోని ‘సూసేకి’ అనే పాటకు 11 మిలియన్ వ్యూస్, అదే చిత్రం నుండి విడుదలైన ‘పుష్ప పుష్ప’ పాటకు 10 మిలియన్ కి పైగా వ్యూస్, అలాగే ‘దేవర’ చిత్రం లోని ‘ఫియర్ సాంగ్’ కి 5 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఇదే రీసెంట్ సమయంలో మన టాలీవుడ్ పాన్ ఇండియన్ చిత్రాలకు వచ్చిన వ్యూస్.ఇప్పుడు ఈ రికార్డ్స్ అన్నిటిని ‘రా మచ్చ మచ్చ’ సాంగ్ బద్దలు కొట్టేసింది. మరి లాంగ్ రన్ లో ఈ పాట 100 మిలియన్ కి పైగా వ్యూస్ ని సాధిస్తుందో లేదో చూడాలి. చార్ట్ బస్టర్ గా నిల్చిన ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన వినిపిస్తుంది. ఇంస్టాగ్రామ్ లో అప్పుడే వందల సంఖ్యల రీల్స్ కూడా వస్తున్నాయి. ట్రెండ్ ని చూస్తుంటే కచ్చితంగా ఈ పాటకు భవిష్యత్తులో 100 మిలియన్ కి పైగా వ్యూస్ వస్తాయని అంటున్నారు విశ్లేషకులు.