Rajinikanth: అస్వస్థకు గురైన రజినీకాంత్ కి చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన గుండెకు సంబంధించిన సమస్యలతో ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి. అయితే రజినీకాంత్ కి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డారట. వైద్యుల బృందం ఆయనకు ఆపరేషన్ చేశారట. పొత్తి కడుపు కింది భాగంలో రజినీకాంత్ కి స్టెంట్ వేశారట. రజినీకాంత్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని సమాచారం. రెండు మూడు రోజుల్లో ఆయన డిశ్చార్జ్ అవుతారట.
73 ఏళ్ల రజినీకాంత్ కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు ఆయన విపరీతంగా మద్యం సేవించేవారట. అలాగే ధూమపానం చేసేవారట. ఈ దురలవాట్ల కారణంగా ఆయన ఆరోగ్యం పాడైంది. వయసు మీద పడటంతో ఒకప్పటి చెడు వ్యసనాల ప్రభావం, ఆయన శరీరం పై చూపిస్తున్నట్లు వినికిడి.
కొన్నేళ్ల క్రితం రజినీకాంత్ అమెరికాలో లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆరోగ్యం సహకరించని కారణంగానే… రజినీకాంత్ రాజకీయాలకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. అభిమానులు ఎంతగా బ్రతిమిలాడినా… రజినీకాంత్ ఇకపై నో పాలిటిక్స్ అన్నారు. అయితే రజినీకాంత్ వరుస చిత్రాలు చేస్తున్నారు. ఆయన లేటెస్ట్ మూవీ వెట్టై యాన్ అక్టోబర్ 10న విడుదల కానుంది. టీజే జ్ఞావవేల్ ఈ చిత్ర దర్శకుడు. అమితాబ్, ఫహద్ ఫాజిల్ వంటి స్టార్ కాస్ట్ నటించారు.
అలాగే లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ టైటిల్ తో ఒక చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీలో హీరో నాగార్జున కీలక రోల్ చేయడం విశేషం. కూలీ షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక రజినీకాంత్ గత చిత్రం జైలర్ బ్లాక్ బస్టర్ నమోదు చేసింది. రూ. 600 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టింది.