https://oktelugu.com/

Game Changer : ‘గేమ్ చేంజర్’ మూవీ ‘ యూఎస్ఏ ‘ ప్రీమియర్ రివ్యూ…ఇంతకీ మూవీ హిట్టా..? ఫట్టా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నా నటుడు రామ్ చరణ్...ఈయన వరుసగా మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.

Written By:
  • Gopi
  • , Updated On : January 9, 2025 / 10:15 AM IST

    Game Changer

    Follow us on

    Game Changer : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నా నటుడు రామ్ చరణ్…ఈయన వరుసగా మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధిస్తూ ఆయనకంటూ ఒక ఐడెంటిటిని కూడా తీసుకొచ్చి పెడుతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు… ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన శంకర్ డైరెక్షన్ లో చేసిన ‘గేమ్ చేంజర్ సినిమా ఈనెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే ఇప్పటికే యూఎస్ఏ లో ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ ని ప్రదర్శించారు. మరి అక్కడ ఈ సినిమాని చూసిన కొంతమంది చెబుతున్న దాని ప్రకారం ఈ సినిమా సక్సెస్ ని సాధించిందా? లేదా ప్లాప్ ను మూట గట్టు కుందా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    కథ

    ఈ సినిమా కథ విషయానికి వస్తే జనానికి మంచి చేయాలి అనుకునే ఒక ఐఏఎస్ ఆఫీసర్ (రామ్ చరణ్) కి, అలాగే జనాలను తొక్కుతూ ఎదిగి అన్యాయాలు, అక్రమాలు చేసి అయిన సరే డబ్బులని సంపాదించుకోవాలనే ఒక చెడ్డ ఆలోచనలతో ఉన్న మంత్రి (ఎస్ జే సూర్య) కి మధ్య జరిగే పోరాటం…అయితే ఇందులో ఎవరి మీద ఎవరు మీద పై చేయి సాధించారు.జనానికి చేయాల్సిన మంచి రామ్ చరణ్ చేశాడా? లేదంటే రామ్ చరణ్ ను ట్రాన్స్ఫర్ చేయించి ఆ మంత్రి అతని మీద పై చేయి సాధించి మొత్తానికైతే తను గెలుపొందాడా? అనే విషయాలు తెలియాలంటే ఇండియాలో రేపు రిలీజ్ అవుతున్న ఈ సినిమాను చూడాల్సిందే…

    విశ్లేషణ

    ఇక యూఎస్ఏ ప్రీమియర్స్ ప్రకారం ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు శంకర్ కార్తీక్ సుబ్బరాజు కథ తీసుకున్నప్పటికి ఈ కథని తను ఓన్ చేసుకొని మరి డైరెక్షన్ చేశాడట. అందువల్లే ఈ సినిమాలో ప్రతి పాయింట్ ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా ఉందని మొదటినుంచి చివరి వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిందని సినిమాని చూసిన యూఎస్ఏ ప్రేక్షకులు వాళ్ళ అభిప్రాయాలనైతే తెలియజేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇంటర్వెల్ కి ముందు ఒక 20 నిమిషాలు సినిమాలో రామ్ చరణ్ తన నట విశ్వ రూపాన్ని చూపించాడంటూ వాళ్లు కామెంట్లు చేస్తున్నారు. నిజానికి రామ్ చరణ్ తన నటనలో మంచి పరిణితిని ఈ సినిమాలో మనం చూడొచ్చని కూడా చెబుతున్నారు. ఇక ‘రంగస్థలం’, ‘త్రిబుల్ ఆర్ ‘ తర్వాత అంత మంచి పాత్రను పోషించిన రామ్ చరణ్ ఈ సినిమాతో మరోసారి తన విజయకేతనాన్ని కూడా ఎగరవేశారు అంటూ వాళ్ళు చెబుతూ ఉండటం విశేషము…

    దర్శకుడు శంకర్ మొదటి నుంచి ఈ సినిమాని చాలా గ్రిప్పింగ్గా తీసుకెళ్లడట. కథ విషయంలో గాని స్క్రీన్ ప్లే విషయంలో కానీ ఆయన ఎక్కడ తడబడకుండా ముందుకు సాగుతూ ఉండడం తద్వారా డైరెక్షన్ మీద చాలా ఎక్కువ ఫోకస్ చేశారట. ఇక కొన్ని సీన్స్ ని విజువల్ వండర్ గా తెరికెక్కించడంలో కూడా శంకర్ చాలా వరకు సక్సెస్ అయ్యాడని చెబుతున్నారు. ఇక క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉందని సెకండాఫ్ మొత్తం చాలా ఫాస్ట్ గా సాగుతుందంటూ ఎక్కడ బోర్ కొట్టకుండా క్యూరియాసిటీని మెయింటైన్ చేస్తూ కథలో ప్రతి ప్రేక్షకుడిని ఇన్వాల్వ్ చేస్తూ శంకర్ ఈ సినిమాని చేశాడంటూ చాలామంది వాళ్ళ అభిప్రాయాలైతే తెలియజేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా యూఎస్ఏ ప్రేక్షకులు ఈ సినిమాని చూసి చాలా బాగా ఎంజాయ్ చేశామంటూ చెబుతుండటం విశేషం… ఇక ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటించిన రామ్ చరణ్ ప్రతి పాత్రలో కూడా తను వేరియేషన్స్ అయితే చూపించినట్టుగా తెలుస్తోంది…

    ఆర్టిస్టుల పర్ఫామెన్స్

    ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే రామ్ చరణ్ మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించి యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులను అలరించడానికి మరోసారి సిద్ధమయ్యారట. ఇక ఇప్పటికే యూఎస్ఏ ప్రేక్షకులు రామ్ చరణ్ యాక్టింగ్ చూసి మరోసారి సినిమా టికెట్లను బుక్ చేసుకొని సినిమా చూడాలనే ఉత్సాహాన్ని చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక కథలో మొదటి నుంచి చివరి వరకు రామ్ చరణ్ చాలా సెటిల్డ్ పర్ఫామెన్స్ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక సినిమా మొత్తాన్ని తను ఒంటి చేత్తో ముందుకు తీసుకెళ్లడని కూడా చెబుతున్నారు. ఎస్ జె సూర్య యాక్టింగ్ చాలా కన్నింగ్ గా ఉండటమే కాకుండా అందులో వేరియేషన్స్ ని కూడా చూపిస్తూ సినిమా మీద మరోసారి హైప్ ను పెంచాడు.

    ఇక ఈ సినిమాతో ఆయన తెలుగులో విలన్ గా సెటిలైపోవచ్చు అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ఇక హీరోయిన్ కైరా అద్వానీ తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించింది. అలాగే అంజలి పాత్ర ఈ సినిమాలో చాలా కీలకంగా ఉందట. ఆమె వల్లే సినిమా కథ మొత్తం చేంజ్ అవ్వబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా అంజలి చాలా రోజుల తర్వాత ఒక మంచి పాత్రని పోషించిందని కూడా జనాలు చెబుతుండడం విశేషం… వెన్నెల కిషోర్, సునీల్ లాంటి నటులు కూడా కామెడీని పండించే ప్రయత్నం అయితే చేసినట్టుగా తెలుస్తోంది…

    టెక్నికల్ అంశాలు

    ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే తమన్ ఈ సినిమాకు చాలా మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక సినిమాటోగ్రఫీ కూడా చాలా ఎక్స్ట్రాడినర్ గా ఉండటమే కాకుండా శంకర్ ఏదైతే కోరుకున్నాడో దాన్ని విజువల్ వండర్ గా స్క్రీన్ మీద చూపించడంలో సినిమాటోగ్రాఫర్ చాలా వరకు హెల్ప్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది…