https://oktelugu.com/

Devi Shri Prasad : దేవి శ్రీ ప్రసాద్ నాగ వంశీ మధ్య గొడవేంటి..? వీళ్లిద్దరూ ఎందుకు కలిసి సినిమా చేయడం లేదు.?

సినిమా ఇండస్ట్రీలో హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. తద్వారా వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా తమకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఉంటారు.

Written By:
  • Gopi
  • , Updated On : January 9, 2025 / 10:08 AM IST

    Devi Shri Prasad

    Follow us on

    Devi Shri Prasad : సినిమా ఇండస్ట్రీలో హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. తద్వారా వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా తమకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుని కెపాసిటీ ఉన్న చాలా మంది హీరోలు స్టార్ డమ్ ను అందుకుంటూ ముందుకు సాగుతున్నారు…

    సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే దానికి దర్శకుడు, హీరోలతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా కీలకపాత్ర వహిస్తాడనే విషయం మనకు తెలిసిందే. ఒక సినిమా సక్సెస్ అయింది అంటే ఆ సినిమాలో సాంగ్స్ కీలకపాత్ర వహిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సినిమాలు సాంగ్స్ వల్ల కూడా బాగా ఆడిన సందర్భాలు ఉన్నాయి. సినిమాలో కంటెంట్ లేకపోయినా కేవలం సాంగ్స్ ను బేస్ చేసుకొని మంచి విజయాలను సాధించిన సినిమాలు కూడా ఉన్నాయి. మరి అలాంటి సందర్భంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా గత రెండు దశాబ్దాల నుంచి మంచి విజయాలను అందిస్తూ ముందుకు సాగుతున్న ఏకైక మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్… అయితే ఇప్పటివరకు ఆయన అందరి హీరోల సినిమాలకు మ్యూజిక్ ని అందించినప్పటికి సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో మాత్రం ఇప్పటివరకు అతను సినిమా చేయలేకపోయాడు. కారణం ఏంటి అంటే నాగవంశీకి అతనికి మధ్య చిన్న విభేదాలు రావడం వల్లే వీళ్ళ కాంబినేషన్ లో సినిమాలు రావడం లేదు అంటూ కొన్ని వర్థలైతే వస్తున్నాయి. ఇక రీసెంట్ గా ‘డాకు మహారాజ్’ సినిమా క్యూ అండ్ ఏ శేషన్ లో ఒక రిపోర్టర్ బాబీని ఉద్దేశిస్తూ మీ గత సినిమాకి దేవిశ్రీప్రసాద్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు.

    మరి ఈ సినిమాకి ఎందుకు తమన్ ను తీసుకున్నారు అని అడిగిన ప్రశ్నకి నాగ వంశీ బదులిస్తూ నేను దేవి శ్రీ ప్రసాద్ ని పెట్టుకోను నా సినిమాలకి ఎక్కువగా తమన్ అయితే కరెక్ట్ గా ఉంటాడు కాబట్టి ఆయన్ని తీసుకున్న అది కంప్లీట్ నా డెసిజన్ అంటూ ఆయన చెప్పిన మాటలు వైరల్ గా మారాయి.

    మరి ఏది ఏమైనా కూడా ప్రొడ్యూసర్ నాగ వంశీకి దేవిశ్రీప్రసాద్ కి మధ్య సన్నిహిత సంబంధాలు లేకపోవడం వల్లే ఆయన ఈ బ్యానర్లో సినిమాలు చేయలేకపోతున్నాడు అంటూ కొన్ని వార్తలైతే వెలువడుతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో ఈగోలు అనేవి ఎక్కువగా ఉంటాయి.

    కానీ ఒక సినిమాకి ఎవరైతే అవసరమో ఎవరైతే మంచి అవుట్ ఫుట్ ని ఇస్తారో వాళ్ళని పెట్టుకొని సినిమాను సక్సెస్ చేసుకోవాలి గాని, కోపంతో టాలెంట్ ఉన్నవాన్ని తీసేయడం, టాలెంట్ లేకపోయినా ప్రేమతో పెట్టుకోవడం లాంటివి చేస్తే మొదటికే మోసం వస్తుంది. ఈ ఒక్క విషయాన్ని గమనిస్తే అందరికి మంచిదని ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండడం విశేషం…