Game Changer:నిర్మాత దిల్ రాజు(Dil Raju) బయటకి వచ్చాడంటే చాలు, ఇప్పుడు బోలెడంత నెగటివిటీ ఏర్పడుతుంది. ఎల్లుండి ఆయన నిర్మాతగా వ్యవహరించిన ‘తమ్ముడు'(Thammudu Movie) చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఆ సినిమా పేరు సోషల్ మీడియా లో మారుమోగిపోయేలా చెయ్యాలి. కానీ దిల్ రాజు ఆరు నెలల క్రితం తానూ రామ్ చరణ్(Global Star Ram Charan) తో చేసిన ‘గేమ్ చేంజర్'(Game Changer Movie) చిత్రం పేరు ని మారుమోగిపోయేలా చేస్తున్నాడు. ఇక ఆయన సోదరుడు శిరీష్ రామ్ చరణ్ ని ఉద్దేశిస్తూ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన మాటలు కొన్ని పెను దుమారం రేపాయి. మళ్ళీ ఆయన చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈ వివాదాలకు తెరదించే ప్రయత్నం చేస్తున్నాడు దిల్ రాజు. ఇక మీదట గేమ్ చేంజర్ ప్రస్తావన తీసుకొని రావొద్దు అంటూ మీడియా ని రిక్వెస్ట్ చేస్తున్నాడు.
దిల్ రాజు మాట్లాడుతూ ‘ఎప్పుడో జనవరి లో విడుదలైన ‘గేమ్ చేంజర్’ గురించి మమ్మల్ని ప్రతీ ఒక్క మీడియా జర్నలిస్టులు, రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలే అడిగి మమ్మల్ని చంపుకొని తింటున్నారు. సినిమా విడుదలై ఆరు నెలలు దాటిపోయింది. దేంట్లో చూసిన గేమ్ చేంజర్ టాపిక్ తప్ప మరొకటి లేదు. ఎందుకు అసలు?, ఆడిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం గురించి మాట్లాడుకోవచ్చు కదా. ఇండస్ట్రీ లో ఇప్పటి వరకు ఎన్నో ఫ్లాప్స్ వచ్చాయి,కానీ ఆ సినిమానే పట్టుకొని ప్రతీ ఒక్కరు ఊగుతున్నారు. అనేక ఇండస్ట్రీస్ లో భారీ బడ్జెట్ తో సినిమాలు నిర్మాణమై ఫ్లాప్స్ అవ్వడం లేదా?, ఏ సినిమాని కూడా ఇంతలా పట్టుకోలేదు. నిన్న మా శిరీష్ కూడా మొట్టమొదటిసారి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఆయన తన జీవితం లో ఇంటర్వ్యూ ఇవ్వలేదు. అక్కడ కూడా ఆయన్ని అనవసరం గా ఈ విషయం లోకి లాగేసి, ఆయన నుండి వాళ్లకు కావాల్సిన మాటలు రాబట్టి, అవి సోషల్ మీడియా లో వైరల్ అయ్యి, ట్రోల్స్ కి గురి కావడం వంటివి జరుగుతున్నాయి’.
Also Read: మహేష్ బాబు చేసిన ఆ ఒక్క సినిమా ఆయన కెరియర్ ను 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిందా..?
‘నేను ఇప్పుడు ఎల్లుండి విడుదల కాబోతున్న తమ్ముడు సినిమా కోసం ప్రొమోషన్స్ చేస్తున్నాను. దానికి గురించి మాత్రమే ప్రశ్నలు అడగండి. నాకు రామ్ చరణ్ మధ్య ఎంతో మంచి సాన్నిహిత్యం ఉంది. నేను నిన్న కూడా చెప్తూ ఉన్నా, ఈ ఏడాది రామ్ చరణ్ కి మంచి హిట్ ఇవ్వలేకపోయాము, మంచి స్క్రిప్ట్ ని రెడీ చేసుకొని రామ్ చరణ్ తో ఒక సూపర్ హిట్ సినిమాని తియ్యాలని చెప్పాను. 22 సంవత్సరాల నుండి ఇండస్ట్రీ లో ఉంటూ, అందరి స్టార్ హీరోలతో ఒక అద్భుతమైన రిలేషన్ ని మైంటైన్ చేస్తూ, వాళ్ళతో సినిమాలు తీస్తున్న సంస్థ ఇది. ఒక్క సినిమా ఫ్లాప్ తో రిలేషన్స్ ని ఎప్పుడు చెడగొట్టుకోలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు ది