Game Changer Vs Pushpa 2: త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా ‘గేమ్ చేంజర్’…అయితే ఈ సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియాలో మరొకసారి తన సత్తా ఏంటో చూపించుకోవడానికి రెడీ అవుతున్నాడు. నిజానికైతే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల సినిమా రిలీజ్ అనేది లేట్ అవుతూ వస్తుంది. ఇక ఇదిలా ఉంటే నిన్న ఒక పోస్టర్ ను రిలీజ్ చేసి అందులో సినిమా రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేయడం విశేషం…ఇక ఇప్పుడు ఇదంతా చూస్తున్న కొంతమంది అభిమానులు మాత్రం ఇక డిసెంబర్ నెలలో పుష్ప 2 సినిమా రిలీజ్ అవుతుంది. కాబట్టి అదే నెలలో గేమ్ చేంజర్ సినిమాను కూడా రామ్ చరణ్ తీసుకొస్తున్నాడనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. నిజానికి రామ్ చరణ్ ఎవరితో కూడా పోటీని పెట్టుకోడు. ఎవరి సినిమా వాళ్ళది, ఎవరి సక్సెస్ వాళ్లది అనుకునే స్వభావం కలిగిన మనిషి… కాకపోతే గేమ్ చేంజర్ సినిమాని ఈ సంవత్సరం రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యం లో రామ్ చరణ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక అందుకోసమే డిసెంబర్ 20 వ రిలీజ్ చేస్తున్నామంటూ సినిమా మేకర్స్ ఒక ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే ఇచ్చారు. మరి దీని వల్ల పుష్ప 2 సినిమాకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అంటే సినీ పండితులు మాత్రం తప్పకుండా ఉన్నాయని చెబుతున్నారు. పుష్ప 2 సినిమాకి ప్లాప్ టాక్ వస్తే సినిమా రెండు మూడు రోజుల కంటే ఎక్కువ థియేటర్లలో పెద్దగా తన ప్రభంజనాన్ని చూపించదు.
కానీ ఒకవేళ సక్సెస్ టాక్ వస్తే మాత్రం ఆ సినిమా ప్రభంజనం అనేది దాదాపు నెల రోజుల వరకు ఉంటుంది. కాబట్టి పుష్ప 2 రిలీజ్ అయిన 14 రోజుల్లోనే గేమ్ చేంజర్ రిలీజ్ అయితే జనాలు పుష్ప2 సినిమాని పక్కనపెట్టి గేమ్ చేంజర్ సినిమా వైపు మల్లె అవకాశం ఉంది. తద్వారా పుష్ప 2 సినిమాకి థియేటర్లను కూడా తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక రకంగా పుష్ప 2 సినిమాను గేమ్ చేంజర్ సినిమా భారీగా దెబ్బ కొట్టే అవకాశాలు కూడా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి…
మరి దీనిమీద పుష్ప 2 మేకర్స్ ఎలా స్పందిస్తారనే విషయం తెలీదు గానీ, మొత్తానికైతే రామ్ చరణ్ డిసెంబర్ 20 వ తేదీన ఈ సినిమా థియేటర్లోకి తీసుకొస్తున్నాడు. ఇక ఈ సినిమా నిర్మాత దిల్ రాజు కావడంతో పుష్ప 2 ప్రొడ్యూసర్స్ అయిన మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళకి దిల్ రాజ్ కి కొన్ని అంతర్గత విభేదాలు ఉన్నట్టుగా కూడా అప్పట్లో వార్తలైతే వచ్చాయి.
వీళ్లు కొన్ని సినిమాల రిలీజ్ సమయంలో ఫేస్ టు ఫేస్ ఒకరిని ఒకరు ఉద్దేశించి మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఇదంత పక్కన పెడితే వీళ్ళిద్దరిలో ఎవరు విజయం సాధిస్తారు అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమాలు రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…