https://oktelugu.com/

Game Changer : అక్షరాలా 123 గంటలు..రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ టీజర్ ఖాతాలో మరో సంచలన రికార్డు!

విడుదలైన రోజు నుండి దాదాపుగా 123 గంటలు, అంటే 5 రోజులు నాన్ స్టాప్ గా యూట్యూబ్ లో నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అయిన టీజర్ గా గేమ్ చేంజర్ సరికొత్త రికార్డు ని నెలకొల్పింది. ఇటీవల విడుదలైన సినిమాల టీజర్స్/ ట్రైలర్స్ ఒక్కటి కూడా ఇన్ని రోజులు యూట్యూబ్ లో నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవ్వలేదు.

Written By:
  • Vicky
  • , Updated On : November 17, 2024 / 02:29 PM IST

    Game changer Teaser

    Follow us on

    Game Changer :  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ కి సంబంధించిన టీజర్ ఇటీవలే విడుదలై అభిమానుల నుండి, ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. మొదటి రోజే తెలుగు, తమిళం, హిందీ భాషలకు కలిపి 70 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ‘సలార్’, ‘పుష్ప 2’ చిత్రాల తర్వాత ఆ రేంజ్ వ్యూస్ ఈ సినిమా టీజర్ కి మాత్రమే వచ్చింది. ‘ఇండియన్ 2 ‘ వంటి భారీ డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత శంకర్ ఎలాంటి సినిమా తీస్తాడో అని భయపడిన అభిమానులకు, ఈ సినిమా టీజర్ ని చూసిన తర్వాత వింటేజ్ శంకర్ మార్క్ కమర్షియల్ సినిమా అని అందరికి అనిపించింది. పాటలు కూడా శంకర్ రేంజ్ లోనే ఉన్నాయి. శంకర్ అభిరుచికి తగ్గట్టుగానే థమన్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. ఇదంతా పక్కన పెడితే యూట్యూబ్ లో ఎన్నో రికార్డ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిల్చిన ‘గేమ్ చేంజెర్’ టీజర్ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది.

    అదేమిటంటే విడుదలైన రోజు నుండి దాదాపుగా 123 గంటలు, అంటే 5 రోజులు నాన్ స్టాప్ గా యూట్యూబ్ లో నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అయిన టీజర్ గా గేమ్ చేంజర్ సరికొత్త రికార్డు ని నెలకొల్పింది. ఇటీవల విడుదలైన సినిమాల టీజర్స్/ ట్రైలర్స్ ఒక్కటి కూడా ఇన్ని రోజులు యూట్యూబ్ లో నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవ్వలేదు. కానీ చాలా నెలల క్రితం విడుదలైన ‘పుష్ప 2: ది రూల్’ టీజర్ కి మాత్రం ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. సుమారు 138 గంటలు ఈ టీజర్ నాన్ స్టాప్ గా నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అయ్యింది. ‘గేమ్ చేంజర్’ తృటిలో ఈ రికార్డుని మిస్ అయ్యింది. అయితే పుష్ప టీజర్ తెలుగు , హిందీ, తమిళం, కన్నడ ఇలా అన్ని భాషలకు కలిపి ఒక్కటే టీజర్. కానీ ‘గేమ్ చేంజర్’ మాత్రం ఒక్కో భాషకి ఒక్కో టీజర్ ని విడుదల చేసారు. పుష్ప 2 లాగ చేసి ఉండుంటే, ఆ రికార్డుని కూడా బద్దలు కొట్టేదని అంటున్నారు అభిమానులు.

    ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి కొంత భాగం షూటింగ్ ఇంకా మిగిలే ఉంది. రేపటి నుండి విజయవాడ లో ఈ చివరి షెడ్యూల్ ని పూర్తి చేయబోతున్నాడు డైరెక్టర్ శంకర్. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ ఉండదు, కేవలం సపోర్టింగ్ రోల్స్ చేసే వారు మాత్రమే ఈ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. డిసెంబర్ 10 లోపు మొదటి కాపీ ని రెడీ చేసి సెన్సార్ కి పంపనున్నారు. వచ్చే నెలలోనే ఓవర్సీస్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలు పెట్టబోతున్నారట. శ్లోకా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ని కొనుగోలు చేసింది. ఇటీవల కాలం లో విడుదల అవుతున్న పాన్ ఇండియన్ సినిమాలన్నీ నార్త్ అమెరికా లో ‘పతిరంగా సినిమాస్’ సంస్థ విడుదల చేస్తుంది. కానీ ఇప్పుడు వేరే సంస్థ చేతుల్లోకి వెళ్లడం భారీ రిలీజ్ దొరుకుతుందా లేదా అని అభిమానులు కంగారు పడుతున్నారు.