https://oktelugu.com/

Pushpa 2 : పుష్ప 2′ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పాసుల కోసం అల్లు అర్జున్ అభిమానుల్లో కొట్లాట..పాట్నా దద్దరిల్లిపోయిందిగా!

నేడు బీహార్ లోని పాట్నాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కి సంబంధించిన పాసులను నిర్వాహకులు నిన్న అభిమానులకు పంపిణి చేసే కార్యక్రమం తలపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు భారీ ఎత్తున అక్కడికి హాజరై, పాసుల కోసం పడిగాపులు గాశారు.

Written By: Vicky, Updated On : November 17, 2024 2:13 pm
Allu arjun Fans

Allu arjun Fans

Follow us on

Pushpa 2 :  మరో 18 రోజుల్లో థియేటర్స్ లోకి రాబోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2 : ది రూల్’ థియేట్రికల్ ట్రైలర్ నేడు సాయంత్రం 6 గంటల నుండి యూట్యూబ్ లో అందుబాటులోకి రానుంది. ఈ ట్రైలర్ కోసం కేవలం అల్లు అర్జున్ అభిమానులు మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. మన తెలుగు ఆడియన్స్ కంటే ఎక్కువగా ఈ సినిమా కోసం హిందీ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. పుష్ప పార్ట్ 1 కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కంటే హిందీలోనే పెద్ద హిట్ అయ్యింది. అల్లు అర్జున్ మ్యానరిజమ్స్, స్టైల్స్ ని అక్కడి ఆడియన్స్ ఒక రేంజ్ లో అనుసరించారు. బాలీవుడ్ లో ఏ హీరోకి రానంత క్రేజ్ ఈ సినిమాతో అల్లు అర్జున్ కి వచ్చింది. ఆయన క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి నిన్న పాట్నా లో జరిగిన ఒక సంఘటన ఉదాహరణగా నిల్చింది.

నేడు బీహార్ లోని పాట్నాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కి సంబంధించిన పాసులను నిర్వాహకులు నిన్న అభిమానులకు పంపిణి చేసే కార్యక్రమం తలపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు భారీ ఎత్తున అక్కడికి హాజరై, పాసుల కోసం పడిగాపులు గాశారు. నిర్వాహకులు అందిస్తున్న నివేదిక ప్రకారం దాదాపుగా 20 వేల మంది అభిమానులు నిన్న పాసుల కోసం వచ్చారట. దీంతో తోపులాట జరిగి గందరగోళం అవ్వడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కొంతమంది అభిమానులు పాసుల కోసం కొట్లాటకు కూడా దిగారట. ఒక తెలుగు హీరో సినిమాకి బీహార్ వంటి ప్రాంతంలో ఇంత క్రేజ్ ఉండడం ఏంటి అని సోషల్ మీడియాలో నెటిజెన్స్ ఆశ్చర్యపోయారు. దీనిని బట్టి అల్లు అర్జున్ క్రేజ్ నార్త్ స్టేట్స్ లో ఏ రేంజ్ లో ఉందో ఊహించుకోవచ్చు. పుష్ప 2 మొదటి రోజు ఓపెనింగ్ ని మీ ఊహలకే వదిలేస్తున్నాం.

ఇది ఇలా ఉండగా ట్రైలర్ కోసం అభిమానుల కంటే ఎక్కువగా ట్రేడ్ ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఇప్పటి వరకు 8 లక్షల 75 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు బుకింగ్స్ ద్వారా వచ్చాయి కానీ, అవి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుకి ఏ మాత్రం సరిపోవు. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే 25 మిలియన్ డాలర్ల వసూళ్లు కేవలం నార్త్ అమెరికా నుండి రావాలి. అంటే ప్రీమియర్ షోస్ నుండి కనీసం 4 మిలియన్ల డాలర్లు రావాలి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ని చూస్తే అది సాధ్యం అయ్యేట్టు లేదు. అందుకే ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ సినిమా ఓవర్సీస్ బుకింగ్స్ మొత్తం ఊపు అందుకుంటాయని ఆశిస్తున్నారు మేకర్స్. చూడాలి మరి ట్రైలర్ ఏ రేంజ్ లో ఉండబోతుందో.