Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2 ‘ చిత్రం బాక్స్ ఆఫీస్ మేనియా ఇప్పట్లో ఆగే సూచనలు అసలు కనిపించడం లేదు. మొదటి రోజు నుండి నేటి వరకు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రాబడుతున్న వసూళ్లను చూసి ట్రేడ్ పండితులు సైతం విస్తుపోయారు. రాజమౌళి కి తప్ప ఎవరికీ సాధ్యం కాదు అనుకున్న 2000 కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ ని ఈ చిత్రం కచ్చితంగా అందుకునేలాగానే అనిపిస్తుంది. నిన్న కూడా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా పది కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. వీకెండ్ దాటితే వసూళ్లు భారీగా తగ్గిపోతున్న ఈ రోజుల్లో, ఇన్ని రోజులు బాక్స్ ఆఫీస్ వద్ద స్టడీ కలెక్షన్స్ ని రాబట్టడం నిజంగా ఒక అద్భుతం అనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో నిన్నటితో జోరు తగ్గిపోయింది. వరుసగా 25 రోజుల పాటు నాన్ స్టాప్ కోటి రూపాయిల షేర్ వసూళ్లను తెలుగు రాష్ట్రాల నుండి రాబట్టిన ఈ చిత్రానికి నిన్న, మొన్న మాత్రం కోటి రూపాయిలకంటే తక్కువ వసూళ్లు వచ్చాయి.
26 వ రోజు 72 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, 27 వ రోజు 88 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక నేడు ఈ సినిమా పై న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ప్రభావం చాలా గట్టిగానే పడినట్టు అనిపిస్తుంది. ప్రస్తుతం బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 18 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. అంటే నేడు ఈ చిత్రానికి 15 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే సూచనలు ఉన్నాయి. 27 రోజులు దాటిన తర్వాత ఒక సినిమాకి ఈ స్థాయి ట్రెండ్ ఉండడం ఇంతకు ముందు ఎప్పుడైనా మనం చూశామా..?, ఈ ట్రెండ్ ని చూస్తుంటే సంక్రాంతి పండుగల సమయంలో కూడా ఆడియన్స్ ‘పుష్ప 2’ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సంక్రాంతికి బాలీవుడ్ స్టార్ హీరోల నుండి ఒక్క సినిమా కూడా రావడం లేదు.
కేవలం మన టాలీవుడ్ నుండి రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం మాత్రమే డబ్బింగ్ ద్వారా విడుదల కాబోతుంది. ఈ సినిమాకి టాక్ వస్తే ‘పుష్ప 2 ‘ మేనియా బాలీవుడ్ లో తగ్గుతుంది. ఒకవేళ టాక్ రాకపోతే మాత్రమే, బాలీవుడ్ ఆడియన్స్ పుష్ప 2 కి మరో రౌండ్ వేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ చిత్రానికి 1790 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 800 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఇదే ట్రెండ్ ని మరికొన్ని రోజులు కొనసాగిస్తే కచ్చితంగా ఈ చిత్రం 2000 కోట్ల మార్కుని అందుకుంటుంది. ఓటీటీ రిలీజ్ కూడా 58 రోజుల తర్వాతే అని మేకర్స్ అధికారికంగా చెప్పడంతో వసూళ్లు ఇంకా పెరిగాయి