Gaddar Film Awards Allu Arjun : తెలంగాణ లో తన విప్లవ గీతాలతో జనాల నరనరాల్లో తెలంగాణ ప్రాంతం పై ప్రేమని నింపే ప్రయత్నం చేసిన గద్దర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన లేని లోటు ఎవ్వరూ పూడ్చలేనిది. పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా ఆయనకు వీరాభిమానులు ఉన్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గద్దర్ కి ఎంత పెద్ద వీరాభిమాని అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలా ఆంధ్రా ప్రాంతంలో కూడా ఆయనకు వీరాభిమానులు ఉన్నారు. ఇక తెలంగాణాలో సీఎం రేవంత్ రెడ్డి కూడా గద్దర్ కి వీరాభిమాని. అందుకే ఆయన పేరు చిరస్థాయిగా గుర్తుండిపోయేలా ‘గద్దర్ అవార్డ్స్’ పేరిట సినీ ప్రముఖులలో ఉత్తమ నటన, దర్శకత్వం మరియు ఇతర విభాగాలకు చెందిన వారికి అవార్డ్స్ ప్రకటించాడు. గత ఏడాదికి సంబంధించిన ఉత్తమ అవార్డ్స్ లిస్ట్ ని కాసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించాడు.
ఈ అవార్డ్స్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు కూడా ఉండడం గమనార్హం. గత ఏడాది ఆయన హీరో గా నటించిన ‘పుష్ప 2 ది రూల్’ కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతీ ఒక్కరిని ఆకర్షించింది. కేవలం తెలుగు రాష్ట్ర ప్రజలు మాత్రమే కాదు, దేశం మొత్తం అల్లు అర్జున్ నటనను ఎంజాయ్ చేసింది. అలా దేశం మొత్తం అతన్ని గుర్తించినప్పుడు ఇక తెలంగాణ ప్రభుత్వం గుర్తించకపోతే ఎలా?, అందుకే ఆ చిత్రానికి గాను అల్లు అర్జున్ ని ఉత్తమ నటుడిగా ఎంపిక చేసింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయించిన ప్రభుత్వమే, ఇప్పుడు ఆయన్ని అరుదైన గౌరవం తో సత్కరిస్తుండడం నిజంగా అభినందించదగ్గ విషయం.
ఇక ఉత్తమ దర్శకుడు క్యాటగిరీ లో కల్కి చిత్రానికి దర్శకత్వం వహించినందుకు గానూ నాగ అశ్విన్ కి ఉత్తమ దర్శకుడు అవార్డు ని ప్రకటించారు. కల్కి చిత్రాన్ని ఈయన ఎంత అద్భుతంగా తెరకెక్కించాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేవలం రెండు మూడు సినిమాల అనుభవం తో ఒక సరికొత్త లోకంలోకి తీసుకెళ్లేలా చేసాడు డైరెక్టర్. అలాంటోడికి ఈ అవార్డు ఇవ్వడం సరైనది అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అదే విధంగా ఉత్తమనటి క్యాటగిరీ లో ’35 చిన్న కథ కాదు’ చిత్రం లో నటించిన నివేత థామస్ ని ఎంపిక చేయగా, ఉత్తమ సపోర్టింగ్ రోల్ క్యారక్టర్ కోసం సరిపోదా శనివారం చిత్రం నుండి SJ సూర్య ని ఎంచుకున్నారు. అదే విధంగా ఉత్తమయ సహాయనటి క్యాటగిరీ లో ‘అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్’ లో నటించిన శరణ్య ప్రదీప్ ని ఎంచుకున్నారు.