Bommarillu Movie Missed Hero: సినిమాల ప్రభావం జనాల మీద విపరీతంగా ఉంటుంది అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఒక సినిమాని చూసిన ప్రేక్షకుడు ఆ సినిమాలో హీరోని అనుకరిస్తూ అతను ఎలాంటి డైలాగులు అయితే చెబుతాడో అలాంటి డైలాగులు చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటాడు. నిజానికి సినిమా కథలను సైతం సొసైటీలో జరిగే నిజ జీవితపు కథలను ఆధారంగా చేసుకొని రాస్తూ ఉంటారు. ఇక ఇలాంటి వాటిలో కొన్ని సినిమాలు ప్రేక్షకులకు మెసేజ్ ని అందిస్తూ ఉంటాయి. ఇక మరికొన్ని సినిమాలు మాత్రం కేవలం ప్రేక్షకులకు ఎంటర్ టైన్ చేస్తూ ఉంటాయి.. ఇక దిల్ రాజు ప్రొడ్యూసర్ గా సిద్దార్థ్, జెనీలియా హీరో హీరోయిన్లుగా వచ్చిన బొమ్మరిల్లు (Bommarillu) సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. పిల్లల మీద పేరెంట్స్ ఎక్కువగా కేర్ తీసుకోవడం కూడా పిల్లల కెరియర్ని నాశనం చేస్తుంది. కొన్ని విషయాల్లో వాళ్ళకి సంబంధించిన ఓన్ డిసీజెస్ ని తీసుకునే అవకాశాన్ని వాళ్ళ కల్పించాలి అనే ఒక కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది.
Also Read: స్టార్ హీరో దర్శకత్వంలో హృతిక్ రోషన్ కొత్త చిత్రం..పెద్ద రిస్క్ చేస్తున్నాడుగా!
అయితే ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా ఈ సినిమాను చూసిన చాలా మంది పేరెంట్స్ మారిపోయారు అంటూ అప్పట్లో కొన్ని కథనాలు కూడా వెలువడ్డాయి. అయితే ఈ సినిమాలో సిద్దార్థ్ కంటే ముందే దిల్ రాజు జూనియర్ ఎన్టీఆర్ ని కలిసి ఈ కథను వినిపించారట.ఇందులో నువ్వే హీరోగా చేయాలని దిల్ రాజు చెప్పారట. అయితే జూనియర్ ఎన్టీఆర్ కి కథ బాగా నచ్చినప్పటికి ఆయన ఈ సినిమాను నేను చేయనని చెప్పారట.
ఎందుకంటే ఈ సినిమాలో హీరో చాలా సింపుల్ గా ఉంటాడు కానీ ఎన్టీఆర్ కి అప్పటికే మాస్ ఇమేజ్ విపరీతంగా ఉండటం వల్ల తన ఇమేజ్ వల్ల ఈ కథ కి డ్యామేజ్ జరుగుతుంది. కాబట్టి దానికి నాకంటే కూడా ఒక చిన్న హీరో అయితే బాగుంటాడు అని చెప్పడంతో ఆ సినిమాని సిద్ధార్థ తో చేశారని ఒకానొక సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూ లో ఈ విషయాన్ని తెలియజేశాడు.
బొమ్మరిల్లు సినిమా తనకు చాలా ఇష్టమని ఇప్పటికీ చెబుతూ ఉంటాడు…మరి మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో ఒక సినిమా కూడా రాలేదు. మరి ఫ్యూచర్లో వీళ్ళ కాంబినేషన్ ఏదైనా సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…