Gabbar Singh Re Release Collection: కేవలం ఒక్క థియేటర్ నుండే 1 కోటి గ్రాస్..రీ రిలీజ్ లో కూడా అద్భుతాలు సృష్టిస్తున్న ‘గబ్బర్ సింగ్’

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గత ఏడాది పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్ర పోషించిన బ్రో చిత్రం విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజి ఫలితాన్ని చూసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఫుల్ రన్ లో కేవలం 95 లక్షల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.

Written By: Vicky, Updated On : August 28, 2024 8:02 pm

Gabbar Singh Re Release

Follow us on

Gabbar Singh Re Release Collection: రీ రిలీజ్ చిత్రాలలో ‘గబ్బర్ సింగ్’ ఆల్ టైం సెన్సేషనల్ రికార్డ్స్ ని నెలకొల్పబోతుందా..?, స్టార్ హీరోల కొత్త సినిమాలకు కూడా సాధ్యం కానీ అరుదైన రికార్డ్స్ ని క్రియేట్ చెయ్యబోతుందా అంటే అవుననే అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ సినిమాకి జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ ని చూసి నోరెళ్లబెడుతున్నారు. నేడు బుక్ మై షో లో అభిమానులకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో ఒక్క టికెట్ బుక్ చెయ్యడానికి మూడు చెరువుల నీళ్లు తాగినంత కష్టమైంది. అసంఖ్యాకమైన రిక్వెస్ట్ లు రావడం వల్ల బుకింగ్స్ లో గ్లిచ్ ఏర్పడి చాలాసేపు బుకింగ్స్ అవ్వలేదు. దీంతో అభిమానులు నేరుగా థియేటర్ కి వెళ్లి టికెట్స్ కోసం పోరాటం చేసారు. అప్పటికీ కూడా దొరకడం చాలా కష్టమైంది.

ఆ స్థాయిలో గబ్బర్ సింగ్ టికెట్స్ కి క్రేజ్ ఏర్పడింది. ఇదంతా పక్కన పెడితే హైదరాబాద్ లో ఈ చిత్రం అప్పుడే కోటి రూపాయిల గ్రాస్ మార్కుని దాటేసింది. అనేక సెంటర్స్ లో కళ్ళు చెదిరే గ్రాస్ లు ఈ చిత్రానికి వస్తున్నాయి. ట్రేడ్ పండితుల లెక్క ప్రకారం ‘గబ్బర్ సింగ్’ టికెట్స్ కి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న క్రేజ్ ని చూస్తుంటే, కేవలం ఆ ఒక్క సెంటర్ నుండే కోటి రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇదే కనుక జరిగితే సెన్సేషనల్ రికార్డు అనే చెప్పాలి. ఇప్పటి వరకు విడుదలైన రీ రిలీజ్ చిత్రాలలో మహేష్ బాబు మురారి చిత్రానికి 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు ఈ సెంటర్ నుండి వచ్చాయి. అయితే గబ్బర్ సింగ్ చిత్రం మాత్రం రీ రిలీజ్ చిత్రాలలో మొట్టమొదటి కోటి రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలుస్తుందని అంటున్నారు.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గత ఏడాది పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్ర పోషించిన బ్రో చిత్రం విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజి ఫలితాన్ని చూసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఫుల్ రన్ లో కేవలం 95 లక్షల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. అలాంటిది ‘గబ్బర్ సింగ్’ చిత్రం రీ రిలీజ్ కోటి రూపాయిల గ్రాస్ ని కొట్టబోతుందంటే, ఇది నిజంగా అద్భుతం అనే చెప్పాలి. కేవలం హైదరాబాద్ లో మాత్రమే కాదు, నైజాం మొత్తం మీద గబ్బర్ సింగ్ రీ రిలీజ్ కి కనీవినీ ఎరుగని గ్రాస్ వసూళ్లు వస్తున్నాయి. ఇక ఆంధ్ర లో అయితే టికెట్స్ ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు కానీ, అప్పుడే మాకు ఇన్ని టికెట్స్ కావాలి అంటూ థియేటర్స్ యాజమాన్యం కి ఫోన్ కాల్స్ వస్తున్నాయట. ఊపు చూస్తూ ఉంటే ఈ చిత్రానికి మొదటి రోజు 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వస్తాయని, ఫుల్ రన్ లో 20 కోట్ల రూపాయిల వసూలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రేడ్ పండితులు అంటున్నారు.