Bigg Boss 8 Telugu: ‘బిగ్ బాస్ 8 తెలుగు’ బజ్ కి ఊహించని యాంకర్.. ఎవరో గుర్తుపట్టగలరా?

ఈ సీజన్ 'బిగ్ బాస్' బజ్ ఎపిసోడ్స్ కి ఎవరు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారు అనేదానిపై కొంతకాలం సస్పెన్స్ నడిచింది. గత సీజన్ లో టాప్ 3 కంటెస్టెంట్ గా నిల్చిన శివాజీ హోస్ట్ గా వ్యవహరిస్తాడని అనుకున్నారు. కానీ ఆయన ఎందుకో ఒప్పుకోలేదు, ఆ తర్వాత అమర్ దీప్, శోభా శెట్టి పేర్లను పరిశీలించారు కానీ, చివరికి అంబటి అర్జున్ ని ఫిక్స్ చేసారు.

Written By: Vicky, Updated On : August 28, 2024 8:46 pm

Bigg Boss 8 Telugu(2)

Follow us on

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ కి సంబంధించి ఏ న్యూస్ బయటకి వచ్చినా సోషల్ మీడియా మొత్తం వైరల్ అయిపోవడం మనం గమనిస్తూనే ఉన్నాం. గత సీజన్ పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ 8వ సీజన్ పై అభిమానుల్లో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక్కోసారి అంచనాలకు తగ్గట్టుగా ఏదైనా లేకపోతే దారుణమైన ఫలితాలు వస్తుంటాయి. ఇది బిగ్ బాస్ సీజన్ 6 విషయం లో జరిగింది. భారీ అంచనాల నడుమ ప్రసారమైన ఈ సీజన్ కి డిజాస్టర్ టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి. కనీసం ఫైనల్ ఎపిసోడ్ కి కూడా అనుకున్న స్థాయి లో రేటింగ్స్ రాలేదు. ఆ భయం బిగ్ బాస్ టీం లో అలాగే ఉంది. అందుకే ఈ సీజన్ ఎక్కడా తగ్గకుండా, సీజన్ 7 ని మించేలా ప్లాన్ చేసారు. ఇప్పటికే ఈ సీజన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ గురించి మీరంతా సోషల్ మీడియా లో ప్రతీ రోజు చూస్తూనే ఉన్నారు.

Bigg Boss 8 Telugu(3)

అయితే ఈ సీజన్ ‘బిగ్ బాస్’ బజ్ ఎపిసోడ్స్ కి ఎవరు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారు అనేదానిపై కొంతకాలం సస్పెన్స్ నడిచింది. గత సీజన్ లో టాప్ 3 కంటెస్టెంట్ గా నిల్చిన శివాజీ హోస్ట్ గా వ్యవహరిస్తాడని అనుకున్నారు. కానీ ఆయన ఎందుకో ఒప్పుకోలేదు, ఆ తర్వాత అమర్ దీప్, శోభా శెట్టి పేర్లను పరిశీలించారు కానీ, చివరికి అంబటి అర్జున్ ని ఫిక్స్ చేసారు. దీనికి సంబంధించిన ప్రోమో ని ఇటీవలే విడుదల చేసారు. ఈ ప్రోమో కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సాధారణంగా మితభాషి లాగా అనిపించే అంబటి అర్జున్ లో ఇంటర్వ్యూ చేసే స్కిల్స్ ఉన్నాయా అనే అనుమానాలు ప్రేక్షకుల్లో ఉండేవి. కానీ టాస్కులు అయినా , ఏదైనా తాను తీసుకున్న రోల్ కి నూటికి నూరు శాతం న్యాయం చేయగలడని, ఈ ప్రోమో ని చూసిన తర్వాతనే అర్థం అయ్యింది. ఈ ప్రోమో లో అర్జున్ మాట్లాడుతూ ‘టైం బాగున్న వారు బిగ్ బాస్ హౌస్ లో ఉంటారు..టైం బాగాలేని వాళ్ళు ఇక్కడకి వచ్చి కూర్చుంటారు..గుర్తు పెట్టుకోండి, హౌస్ లో మీరు తీసుకునే ప్రతీ నిర్ణయానికి ఇక్కడ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ సీటు యమ హాటు’ అంటూ ఆయన చెప్పిన డైలాగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ ప్రోమో చూస్తుంటే అంబటి అర్జున్ కంటెస్టెంట్స్ ని నిర్మొహమాటంగా, ఏమి అడగాలని అనుకుంటున్నాడో, అది అడిగేస్తాడని అనిపిస్తుంది. ఇది ఇలా ఉండగా ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ లిస్ట్ ఒక సారి గమనిస్తే ఆదిత్య ఓం, బెజవాడ బేబక్క, అంజలి పవన్, ఇంద్రనీల్, యాంకర్ విష్ణు ప్రియా, నిఖిల్, యష్మీ గౌడా, డ్యాన్సర్ నైనికా, శేఖర్ భాష , రీతూ చౌదరి, హీరోయిన్ యశస్వినీ తదితరులు సెప్టెంబర్ 1 న గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారు.