https://oktelugu.com/

Bolisetty Srinivas: అల్లు అర్జున్ ఇంకోసారి నోరు తెరిస్తే అతని లెక్క తేల్చేస్తా అంటూ జనసేన ఎమ్మెల్యే మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్!

అల్లు అర్జున్ అభిమానులు దీనిపై తీవ్ర స్థాయిలో స్పందించారు. అయితే నేడు కూడా మరోసారి ఆయన మాట్లాడిన మాటలు మీడియా కి క్లారిటీ ఇస్తూ 'అల్లు అర్జున్ మా పార్టీ కి శత్రువేమి కాదు. నేను నిన్న అల్లు అర్జున్ మాట్లాడిన మాటలకు మాత్రమే కౌంటర్ ఇచ్చాను.

Written By:
  • Vicky
  • , Updated On : August 28, 2024 / 07:53 PM IST

    Bolisetty Srinivas

    Follow us on

    Bolisetty Srinivas: మెగా మరియు అల్లు అభిమానుల మధ్య గొడవ తారాస్థాయికి చేరిపోయింది. నంద్యాల ఘటన నుండి రోజుకో మలుపుని తిప్పుకుంటూ ఈ గొడవ ముదురుతూనే ఉంది కానీ, ఎక్కడా కూడా తర్వలో గొడవ సర్దుకుంటుంది అనే దాఖలాలు లేవు. ఇటీవలే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్, నంద్యాల ఘటనపై పరోక్షంగా స్పందిస్తూ ‘నాకు ఇష్టమైతే వెళ్తా..ఎవరికీ ఏమి అనిపించినా నేను లెక్క చేయను’ అంటూ పరోక్షంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు కౌంటర్ ఇచ్చాడు. దీనికి జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చాలా ఘాటుగా స్పందించాడు. ఆయన మాట్లాడుతూ ‘అల్లు అర్జున్ కి కూడా అభిమానులు ప్రత్యేకంగా ఉంటారా?, నేనైతే ఎక్కడ వినలేదు, చూడలేదు కూడా. ఆయనకి ఉన్నది మెగా అభిమానులు మాత్రమే. స్థాయికి మించి చాలా మాట్లాడుతున్నాడు ఈమధ్య, తగ్గించుకుంటే బాగుంటుంది’ అంటూ ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో పెను దుమారం రేపింది.

    అల్లు అర్జున్ అభిమానులు దీనిపై తీవ్ర స్థాయిలో స్పందించారు. అయితే నేడు కూడా మరోసారి ఆయన మాట్లాడిన మాటలు మీడియా కి క్లారిటీ ఇస్తూ ‘అల్లు అర్జున్ మా పార్టీ కి శత్రువేమి కాదు. నేను నిన్న అల్లు అర్జున్ మాట్లాడిన మాటలకు మాత్రమే కౌంటర్ ఇచ్చాను. మరోసారి ఆయన అలాగే మాట్లాడే, ఈసారి ఇంకా గట్టిగా కౌంటర్ ఇస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు. దీనిని బట్టీ చూస్తుంటే బొలిశెట్టి శ్రీనివాస్ ‘అసలు తగ్గేదేలే’ మూడ్ లో ఉన్నాడని పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో ఆయనకి ఎలివేషన్స్ వేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు కేవలం అభిమానుల మధ్య మాత్రమే ఉన్న ఈ గొడవ, ఇప్పుడు నేరుగా రెండు వర్గాలకు సంబంధించిన పెద్దవాళ్ళు మాటకి మాట అనే రేంజ్ కి వెళ్ళింది అంటే, ఇది ఇప్పట్లో తేలే విషయం కాదని అంటున్నారు అభిమానులు. స్వయంగా పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ కలిస్తే కానీ ఈ గొడవ ఒక కొలిక్కి రాదు అనే ఉద్దేశ్యం కి వచ్చేసారు. సెప్టెంబర్ 2 వ తారీఖున పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కాబట్టి, ఆరోజు అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఒక ట్వీట్ వేస్తె గొడవలు సగానికి పైగా తగ్గుతాయని అభిమానులు ఆశిస్తున్నారు.

    మరి అల్లు అర్జున్ ట్వీట్ వేస్తాడా..?, చిరంజీవి పుట్టినరోజే ఎదో మొక్కుబడిగా శుభాకాంక్షలు తెలియ చేసిన అల్లు అర్జున్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ వేస్తాడనే నమ్మకం లేదని కొంతమంది అంటున్నారు. అయితే అల్లు అర్జున్ ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ కి ఆల్ ది బెస్ట్ అంటూ ట్వీట్ వెయ్యడమే కాకుండా , ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ సాధించిన ఘనవిజయానికి శుభాకాంక్షలు కూడా తెలియచేసాడు. కాబట్టి ఈసారి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. మరి అది జరుగుతుందా లేదా అనేది తెలియాలంటే మరో 5 రోజులు ఆగాల్సిందే.