Gaami Collections: రెండో రోజు కుమ్మేసిన విశ్వక్ సేన్… గామి ఎన్ని కోట్లు రాబట్టిందంటే?

ఏపీ/తెలంగాణా లలో గామి రూ. 8.20 కోట్ల బిజినెస్ చేసింది. ఇక వరల్డ్ వైడ్ రూ.10.20 కోట్ల బిజినెస్ చేసింది. రూ. 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో గామి బాక్సాఫీస్ బరిలో దిగింది.

Written By: S Reddy, Updated On : March 10, 2024 11:58 am

Gaami Collections

Follow us on

Gaami Collections: విశ్వక్ సేన్ కెరీర్లో గామి స్పెషల్ మూవీగా నిలిచిపోయేలా ఉంది. గామి కి వస్తున్న రెస్పాన్స్ కి యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మార్చి 8న వరల్డ్ వైడ్ విడుదలైంది గామి. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ అఘోరా గా నటించడం విశేషం. విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించగా కార్తీక్ శబరీష్ నిర్మించారు. ఈ చిత్రాన్ని భారీగా ప్రమోట్ చేశారు. ప్రభాస్ గామి ట్రైలర్ పై ప్రశంసలు కురిపించాడు. ఇక ఫస్ట్ షో నుండే గామి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో సత్తా చాటిన గామి మొదటి రోజు విశ్వక్ సేన్ కెరీర్ బెస్ట్ నమోదు చేసింది.

ఇక రెండో రోజు గామి చిత్రానికి రెస్పాన్స్ మరింత పెరిగింది. ఏపీ/తెలంగాణలలో గామి చిత్రం సెకండ్ డే రూ. 1.75 కోట్ల షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్ రూ. 2.50 కోట్ల షేర్ రాబట్టింది. రెండు రోజులకు గామి వరల్డ్ వైడ్ రూ. 7 కోట్ల షేర్ వసూలు చేసింది. గామి చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే… నైజాం రూ. 3.5 కోట్లు, సీడెడ్ రూ. 1.2 కోట్లు, మిలిగిన ఆంధ్రా ఏరియాల్లో రూ.3.5 కోట్లు బిజినెస్ చేసింది.

ఏపీ/తెలంగాణా లలో గామి రూ. 8.20 కోట్ల బిజినెస్ చేసింది. ఇక వరల్డ్ వైడ్ రూ.10.20 కోట్ల బిజినెస్ చేసింది. రూ. 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో గామి బాక్సాఫీస్ బరిలో దిగింది. రెండు రోజుల్లోనే గామి యాభై శాతానికి పైగా రికవరీ చేసింది. నేడు ఆదివారం కాగా గామి బ్రేక్ ఈవెన్ కి చేరుకోవడం ఖాయం. కాబట్టి సోమవారం నుండి వచ్చే కలెక్షన్స్ లాభాలు అని చెప్పొచ్చు.

గామి చిత్ర కథ విషయానికి వస్తే… అఘోర(విశ్వక్ సేన్) అరుదైన వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. అతడు ఎవరినీ తాకకూడదు. అలా తాకితే తీవ్రమైన వ్యాధి బారిన పడతాడు. ఈ వ్యాధికి పరిష్కారం హిమాలయాల్లో ఉంటుంది. అక్కడ 36 ఏళ్లకు ఒకసారి పూసే పూలు మాత్రమే నయం చేస్తాయి. వాటి కోసం అఘోర హిమాలయాల్లో ప్రయాణం సాగిస్తాడు. గామి చిత్రంలో చాందిని చౌదరి కీలక రోల్ చేసింది.