https://oktelugu.com/

Anant And Radhika: మోస్ట్‌ స్టైలిష్‌ పీపుల్స్‌ లిస్ట్‌లో అనంత్‌–రాధిక.. తాజాగా విడుదల చేసిన న్యూయార్క్‌ టైమ్స్‌!

ప్రపంచంలో మిస్‌ వరల్డ్, మిస్‌ యూనివర్స్, మిసెస్‌ వరల్డ్, మిసెస్‌ యూనివర్స్‌ నిర్వహిస్తారు. ఇక వివిధ దేశాల్లో కూడా బెస్ట్‌ కపుల్స్, మిస్, మిసెస్‌ పోటీలు నిర్వహిస్తారు. పురుషులకు మిస్టర్‌ పోటీలు కండక్ట్‌ చేస్తారు. ఇక వివిధ సంస్థలు కూడా బెస్ట్‌ పీపుల్స్‌ను ఎంపిక చేస్తాయి. తాజాగా న్యూయార్క్‌ టైమ్స్‌ స్టైలిష్‌ పీపుల్స్‌ జాబితా ప్రకటించింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 6, 2024 / 02:09 PM IST

    Anant And Radhika

    Follow us on

    Anant And Radhika: మిస్‌ ఇండియా, మిస్‌ యూనివర్స్, మిస్టర్‌ ఇండియా, మిసెస్‌ ఇండియా.. ఇలా దేశంలో వివిధ పోటీలు నిర్వహిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా క్రీడలతోపాటు.. వ్యక్తిగత ఇమేజ్‌ పెంచే పోటీలు నిర్వహిస్తారు. వీటిని ప్రైవేటు సంస్థలు కండెక్ట్‌ చేస్తాయి. ఎంపిక చేసుకున్న అంశాల ఆధారంగా జాబితాను ప్రకటిస్తాయి. తాజాగా అమెరికాకు చెందిన న్యూయార్క్‌ టైమ్స్‌ మోస్ట్‌ స్టైలిష్‌ పీపుల్స్‌ జాబితా విడుదల చేసింది. ఇందులో భారత్‌కు చెందిన ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్‌ మచ్చంట్‌ కుమార్తె రాధికా మర్చంట్‌ను చేర్చింది. వీరి వివాహం ఈ ఏడాది అంగరంగ వైభవంగా జరిగింది. వేడుకలో వధూవరులు ధరించిన దుస్తులు, ఆభరణాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ష్యాషన్‌ ప్రియులను ఆకట్టుకున్నాయి. ఈ కపుల్‌.. ఇప్పుడు స్టైలిష్‌ పీపుల్స్‌ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

    2024 జాబితా విడుదల…
    మోస్ట్‌ స్టైలిష్‌ పీజుల్‌ ఆఫ్‌ 2024 జాబితాను న్యూయార్క్‌ టైమ్స్‌ తాజాగా విడుదల చేసింది. ఇందులో భారత్‌కు చెందిన అనంత్‌ అంబానీ–రాధిక మచ్చంట్‌ జాబితాలో ప్లేస్‌ దక్కించుకున్నారు. వివాహ సమయంలో వారు ధరించిన దుస్తులు, నగలు, అత్యంత వైభవంగా జరిగిన పెళ్లి కార్యక్రమాలు మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకుని వారిని జాబితాలో చేర్చినట్లు న్యూయార్ట్‌ టైమ్స్‌ వెల్లడించింది.

    కనీవిని ఎరుగని రీతిలో పెళ్లి..
    అనంత్‌ – రాధికల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. 2023 జనవరిలో ముంబైలో వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ కార్యక్రమానికి ముంబైలోని జయో టవర్‌ వేదికైంది. వీరి పెళ్లికి దేశ విదేశాల నుంచి నటులు, వ్యాపారులు, ప్రముఖులు హాజరయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా పేరు ఉన్న రిహన్నా, కేటీ పెర్రీ, ఆండ్రియా బోసెల్లి వంటి సెలబ్రిటీలు కూడా వచ్చారు. మూడు నెలలు వెడ్డింగ్‌ వేడుకలు నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం శుభ్‌ వివాహ్‌ తో మొదలైన వేడుకలు శుభ్‌ ఆశీర్వాద్, మంగళ్‌ ఉత్సవ్‌తో ముగిశాయి. ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో దంపతులు ఫ్యాషన్‌ దుస్తుల్లో మెరిశారు. వీరి వివాహం రోజే 50 పేద జంటలకు అంబానీ పెళ్లి జరిపించారు. బంగారం, దుస్తులు కానుకగా ఇచ్చారు.