https://oktelugu.com/

OTT Releases This Week: ఒక్కరోజే 8 చిత్రాలు… ఈ వారంలో ఓటీటీ లో క్రేజీ కంటెంట్, ఇంట్రెస్టింగ్ డిటైల్స్!

భాషతో సంబంధం లేకుండా ఆడియన్స్ నచ్చిన సినిమాలు ఆస్వాదిస్తున్నారు. ఓటీటీ కంటెంట్ చూసే వారి సంఖ్య పెరగడంతో ఆయా సంస్థలు, తమ వినియోగదారుల కోసం ప్రతి వారం విభిన్నమైన చిత్రాలు, సిరీస్లు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.

Written By:
  • S Reddy
  • , Updated On : May 2, 2024 / 06:12 PM IST

    Friday OTT releases

    Follow us on

    OTT Releases This Week: శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాలు, సిరీస్లు ఓటీటీలో సందడి చేస్తుంటాయి. థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న సినిమాలతో పాటు కొన్ని థ్రిల్లింగ్ సిరీస్లు, ఓటీటీ ఒరిజినల్స్ నేరుగా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తాయి. వీకెండ్ లో ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని ఇంటిల్లిపాది ఎంజాయ్ చేస్తున్నారు. ఒకప్పుడు అర్బన్ ఏరియాల్లోనే డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ కి ఆదరణ ఉండేది. మెల్లగా అది పల్లెలకు పాకింది.

    భాషతో సంబంధం లేకుండా ఆడియన్స్ నచ్చిన సినిమాలు ఆస్వాదిస్తున్నారు. ఓటీటీ కంటెంట్ చూసే వారి సంఖ్య పెరగడంతో ఆయా సంస్థలు, తమ వినియోగదారుల కోసం ప్రతి వారం విభిన్నమైన చిత్రాలు, సిరీస్లు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ వీకెండ్ కూడా అదిరిపోయే సినిమాలు అలరించేందుకు సిద్ధం అయ్యాయి. అజయ్ దేవగన్ సైతాన్, మలయాళ హిట్ మూవీ మంజుమ్మేల్ బాయ్స్ తో పాటు క్రేజీ చిత్రాలు స్ట్రీమ్ కానున్నాయి.

    సైతాన్ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఇక మలయాళ చిత్రం మంజుమ్మెల్ బాయ్స్ సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ మలయాళ స్మాల్ బడ్జెట్ మూవీ వరల్డ్ వైడ్ రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు రాబటింది. వీటితో పాటు పలు ఇంగ్లీష్ వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కి సిద్ధం అవుతున్నాయి. మరి ఏ సినిమా ఎక్కడ స్ట్రీమ్ అవుతుందో .. మీరు కూడా ఓ లుక్కేయండి.

    నెట్ ఫ్లిక్స్
    సైతాన్ (హిందీ సినిమా) – మే 3
    ద అపిటికల్ ఫ్యామిలీ (కొరియన్ సిరీస్) – మే 4

    అమెజాన్ ప్రైమ్
    క్లార్క్ సన్ ఫార్మ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – మే 3
    ఉమన్ ఆఫ్ మై బిలియన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) – మే 03

    డిస్నీ ప్లస్ హాట్ స్టార్
    మంజుమ్మెల్ బాయ్స్ (మలయాళ సినిమా) – మే 3
    మాన్స్టర్స్ ఎట్ వర్క్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – మే 5.

    జియో సినిమా
    హ్యక్స్ సీజన్ 3 ఇంగ్లీషే సిరీస్ – మే 3
    ద టాటూయిస్ట్ ఆఫ్ అస్విట్జ్ (ఇంగ్లీష్ సిరీస్) – మే 3
    వొంకా (ఇంగ్లీష్ మూవీ) – మే 3

    జీ 5
    ది బ్రోకెన్ న్యూస్ -2 (బాలీవుడ్ వెబ్ సిరీస్) – మే 3

    లయన్స్ గేట్ ప్లే
    బ్లాక్ మాఫియా ఫ్యామిలీ సీజన్ 3 – మే 3