https://oktelugu.com/

Mahesh Babu: తమిళ్ విజయ్ ఫ్యాన్స్ మహేష్ బాబు ను ట్రోల్ చేయడానికి కారణం ఏంటో తెలుసా..?

మహేష్ బాబు తో పోల్చుకుంటే విజయ్ యాక్టింగ్ బాగలేదంటూ మహేష్ అభిమానులు విజయ్ ను ట్రోల్ చేస్తూ కొన్ని మాటలైతే మాట్లాడారు. ఇప్పుడు కూడా మహేష్ బాబుని కోలీవుడ్ మీడియా కొంతవరకు ట్రోల్ చేస్తున్నారనే చెప్పాలి.

Written By:
  • Gopi
  • , Updated On : May 2, 2024 / 06:10 PM IST

    Mahesh Babu

    Follow us on

    Mahesh Babu: కోలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న నటుడు విజయ్..రజినీకాంత్, కమలహాసన్ లాంటి స్టార్ హీరోలకు సైతం పోటీని ఇస్తూ తనదైన రీతిలో సినిమాలు చేసి సక్సెస్ లను అందుకున్న నటుడు కావడం వల్లే ఆయనకి ఇండస్ట్రీలో చాలా గొప్ప గౌరవమైతే ఉంది. ఇక ప్రేక్షకులందరూ కూడా ఆయన సినిమాలను చూడడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ఉంటారు.

    ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన తెలుగులో మహేష్ బాబు పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలను ఎక్కువగా రీమేక్ చేస్తూ సక్సెస్ లు అందుకుంటూ ఉంటాడు. అయితే 2002 వ సంవత్సరంలో మహేష్ బాబు చేసిన ఒక్కడు సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుంది. ఇక అదే సినిమాని తమిళం లో విజయ్ గిల్లీ పేరుతో రీమేక్ చేసి ఆయన కూడా అక్కడ సక్సెస్ ను అందుకున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాను రీసెంట్ గా రీ రిలీజ్ చేశారు. అయితే గిల్లి సినిమాలో విజయ్ యాక్టింగ్ బాగుంది ఒక్కడులో మహేష్ కంటే గిల్లి లో విజయ్ బెస్ట్ అంటూ చాలా రోజుల నుంచి తమిళ్ మీడియా కోడైకొస్తుంది.

    ఇక మహేష్ బాబు తో పోల్చుకుంటే విజయ్ యాక్టింగ్ బాగలేదంటూ మహేష్ అభిమానులు విజయ్ ను ట్రోల్ చేస్తూ కొన్ని మాటలైతే మాట్లాడారు. ఇప్పుడు కూడా మహేష్ బాబుని కోలీవుడ్ మీడియా కొంతవరకు ట్రోల్ చేస్తున్నారనే చెప్పాలి. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళితో సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఆయనకు భారీ లెవెల్ లో హైప్ అయితే వస్తుంది. ఇక హైప్ ను ఇప్పుడు తగ్గించడానికి పని గట్టుకొని మరి మహేష్ బాబు మీద ట్రోల్స్ అయితే చేస్తున్నారు. ఇక ఇప్పుడు పోకిరి సినిమాతో కూడా పోలుస్తూ ట్రోల్స్ అయితే చేస్తున్నారు.

    ఇక మొత్తానికైతే మనవాళ్లు కూడా ఎక్కడ తగ్గకుండా విజయ్ ని విపరీతంగా ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో ఆ వీడియోలను వైరల్ చేస్తున్నారు. అప్పుడెప్పుడో మొదలైన ఈ గొడవ ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. మరి అటు విజయ్, ఇటు మహేష్ బాబు దీని మీద స్పందించి ఈ గొడవకి ఫుల్ స్టాప్ పెడతారా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది…