Homeఎంటర్టైన్మెంట్Freedom at Midnight web series : ప్రతి ఒక్క భారతీయుడు కచ్చితంగా చూడాల్సిన సినిమా.....

Freedom at Midnight web series : ప్రతి ఒక్క భారతీయుడు కచ్చితంగా చూడాల్సిన సినిమా.. ఎందులో స్ట్రీమింగ్ అంటే..?

Freedom at Midnight web series : సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు  ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులకు కావల్సిన నాలెడ్జ్ ని అందిస్తూ చరిత్రలో మిగిలిపోయిన విషయాలను మన కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూ చరిత్ర గురించి తెలుసుకునేలా చేస్తూ ఉంటాయి. నిజానికైతే ఇలాంటి సినిమాలు చాలా తక్కువ సంఖ్యలో వస్తూ ఉంటాయి. ఇక భారతదేశానికి స్వాతంత్రం ఎలా వచ్చింది. పాకిస్తాన్ భారతదేశం రెండు విడిపోవడానికి గల కారణం ఏంటి? అనే విషయాలను కూడా మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపించడానికి  ఈ సిరీస్ అయితే రెడీగా ఉంది. ఇంతకీ ఆ సిరీస్ ఏంటి అందులో ఏం చూపించారు అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
‘ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్’ అనే పేరుతో వచ్చిన వెబ్ సిరీస్ ఇండియా కి స్వాతంత్ర్యాన్ని తీసుకురావడానికి ఒకప్పటి మన స్వాతంత్ర్య సమరయోధులు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పాకిస్తాన్ వాళ్లకు సపరేట్ దేశం కావాలని ఎందుకు కోరుకుంది. ఇందులో ఎవరెవరు ఎలాంటి రాజకీయాలు చేశారు.
ఎవ్వరి వల్ల మన దేశానికి స్వాతంత్రం వచ్చింది అనే విషయాలను స్పష్టంగా తెలియజేస్తూ మన కళ్లకు కట్టినట్టుగా చూపించారు. ముఖ్యంగా 1946 నుంచి 1947 మధ్య జరిగిన విషయాలను క్షుణ్ణంగా చూపించడంతో పాటు ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా ఈ సీరీస్ ని చూసి అప్పుడు ఏం జరిగింది అనేది తెలుసు కోవాల్సిన అవకాశం అయితే ఉంది.
ఇక 1946 లోకి మనల్ని ఈ సిరీస్ అయితే తీసుకెళ్తుంది. మొదటి ఎపిసోడ్ స్టార్ట్ అయిన వెంటనే ఆ పిరియడ్ లోకి వెళ్లిపోయి అందులో లీనమైపోతాము. ఇక మన కళ్ళు ముందే ఇది అంత జరుగుతుంది అన్నట్టుగా దర్శకుడు మనల్ని ఈ సిరీస్ లోకి తీసుకెళ్లిన విధానం కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ముఖ్యంగా గాంధీజీ, నెహ్రూ, సర్ధార్ వల్లభాయ్ పటేల్ లాంటి గొప్ప గొప్ప స్వాతంత్ర్య సమరయోధులు ఎలాంటి నిర్ణయాలను తీసుకున్నారు.
వాళ్లు చేసిన పనులేంటి వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటి అనేవి కూడా ఈ సినిమాలో చూపించారు. ప్రతి భారతీయుడు ఈ సినిమాని చూడాల్సిన అవసరమైతే ఉంది. ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ పేరుతో సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ 7 ఎపిసోడ్లతో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. మరి ప్రతి ఒక్క భారతీయుడు ఈ సినిమాని చూసి మన చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది…
https://www.youtube.com/watch?v=z0spP–_vC4
Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Exit mobile version