Tollywood: సినిమా హిట్ అయింది అని టాక్ వస్తే.. టాలీవుడ్ లో ఏవరేజ్ కలెక్షన్స్ వస్తాయి. అది కూడా టికెట్ రేటును ఎక్కువకి అమ్ముకుంటే. ఇది టాలీవుడ్ కి ఉన్న నిజమైన వాస్తవ పరిస్థితి. తమ సినిమాలకు వసూళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి అని ప్రతి స్టార్ హీరోకి తెలుసు. కానీ వారం తిరిగేసరికి ఫలానా హీరో సినిమా వంద కోట్లు కలెక్ట్ చేసిందని పేపర్స్ లో పెద్ద యాడ్స్ ఇవ్వాలి. ఈ యాడ్స్ కి అయ్యే డబ్బులు కూడా నిర్మాతకు బొక్కే.

దీనికితోడు ప్రస్తుతం థియేటర్లకు రావడానికి కూడా జనం ఆసక్తి చూపించడం లేదు. కొన్ని ఏరియాల్లో అయితే, కరోనా కారణంగా జనం ఇంకా భయపడుతునే ఉన్నారు. ఈ సమయంలో ఏపీలో టికెట్ రేట్ల విషయంలో జరుగుతున్న రచ్చ నిర్మాతలకు, హీరోలకు కన్నీళ్లు పెట్టించేవే. సరే.. వాళ్ళ కన్నీళ్లకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం లేదు అనుకోండి.
కానీ, ఎవరో ఒక్క హీరో మీద కోపంతో మొత్తం సినిమా ఇండ్రస్ట్రీకే పెద్ద అన్యాయం చేయాలనుకోవడం మంచి పద్దతి కాదు. ఇక ఇవన్నీ చాలవన్నట్టు.. కొత్తగా తెలుగు ఇండస్ట్రీకి మరో పెద్ద సమస్య వచ్చి పడింది. ఒమిక్రాన్ అనే కొత్త రకం వైరస్ ప్రపంచ దేశాల్ని ఒణికిస్తూ.. నెమ్మదిగా భారత్ వైపు కూడా అడుగులు వేస్తోంది.
పైగా ఈ వైరస్ ఉధృతి అతి తీవ్రంగా ఉండబోతోందని డబ్ల్యూ హెచ్ ఓ కూడా ఘాటుగా హెచ్చరించడమే ఇప్పుడు అందర్నీ భయపెడుతుంది. అసలు ఈ వైరస్ ని అరికట్టడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా సమర్ధవంతమైన ప్రభుత్వాలకే అర్ధం కావడం లేదు. ఇక జగన్ ప్రభుత్వం గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది ?
Also Read: Payal Rajput: లోదుస్తులతో అరాచకం.. అవకాశాల కోసమేనా ఈ బరి తెగింపు !
అయితే, ఈ వైరస్ సినిమా వాళ్ళను ఎక్కువ భయపెడుతుంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఏ సమస్య వచ్చినా, ముందుగా నాయకులకు గుర్తుకు వచ్చేది థియేటర్లు మాత్రమే. సోషల్ డిస్టెన్స్ అనగానే ప్రభుత్వాలు చేసే ముందు పని థియేటర్స్ ను క్లోజ్ చేసేలా చర్యలు తీసుకోవడం. అదే బార్లు, వైన్ షాప్ లను మాత్రం వాళ్ళు క్లోజ్ చేయరు.
మరి, ఈ కొత్త వైరస్ అటాక్ అయితే ఏమిటి పరిస్థితి ? తెలుగు చిత్రసీమకు డిసెంబరు నుంచి వచ్చే నాలుగు నెలలు చాలా కీలకం. అఖండ, పుష్ప, శ్యామ్ సింగరాయ్ విడుదల కానున్నాయి. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్, ఆచార్య ఇలా భారీ సినిమాలు ఉన్నాయి. అదృష్టం బాగుండి తెలుగు రాష్ట్రాలలో ఇంకా కేసులేం నమోదు కాలేదు. అయితే, ముందస్తు చర్యగా లాక్ డౌన్ ప్రకటిస్తే.. ఇదే ఇప్పుడు టాలీవుడ్ ని వణికిస్తోంది.
Also Read: Pushpa: పుష్ప ప్రీరిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథిగా ప్రభాస్?