MLA wife in Bigg Boss 9 Telugu: వచ్చే నెల నుండి స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఈసారి ఎప్పుడూ లేని విధంగా సామాన్యులకు ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ గా పాల్గొనే అవకాశం కల్పిస్తూ, అగ్ని పరీక్ష అనే కాంటెస్ట్ ని నిర్వహించి, సామాన్యులకు వివిధ రకాల కఠినమైన టాస్కులు నిర్వహించి కేవలం 5 మందిని మాత్రమే బిగ్ బాస్ హౌస్ లోకి పంపబోతున్నారు. ఈ అగ్నిపరీక్ష షూటింగ్ రేపటితో ముగియబోతుంది. వచ్చే వారం 22వ తారీఖు నుండి ఈ ప్రోగ్రాం జియో హాట్ స్టార్(Jio Hotstar) లో స్ట్రీమింగ్ కానుంది. ఈ ప్రోగ్రాం కి శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తుండగా, అభిజిత్(Abhijeet), బిందు మాధవి(Bindu Madhavi) మరియు నవదీప్(Navdeep) లు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించబోతున్నారు. ఇప్పటికే ఈ ప్రోగ్రాం కి సంబంధించి మూడు ప్రోమోలు విడుదల అయ్యాయి.
సామాన్యుల సంగతి ఓకే, మరి ఈ సీజన్ లో సెలబ్రిటీలుగా ఎవరు రాబోతున్నారు అనే సందేహం అందరిలో ఉంది. వాస్తవానికి ఈసారి సామాన్యులు వస్తున్నారు అనేలోపు టీవీ సీరియల్స్ సెలబ్రిటీలు బిగ్ బాస్ 9 లోకి రావడానికి భయపడడుతున్నారట. కారణం ‘అగ్నిపరీక్ష'(Agnipareeksha) ప్రోగ్రాం ద్వారా వాళ్ళు మంచి ఫ్యాన్ బేస్ ని సంపాదించి లోపలకు అడుగుపెడతారు కాబట్టి, వాళ్ళు మమ్మల్ని అవలీలగా ఓటింగ్ లో డామినేట్ చేస్తారని. అందుకే ఈసారి టీవీ సీరియల్ సెలబ్రిటీలు ఈ షోకి రావడం అసాధ్యం అని అంటున్నారు. బిగ్ బాస్ టీం కూడా సినిమా ఆర్టిస్టుల కోసమే ఈసారి ఎదురు చూస్తున్నారట. ఇప్పటికే కొంతమంది పాపులర్ ఆర్టిస్టులను సంప్రదించినట్టు కూడా తెలుస్తుంది. కేవలం సినిమా ఆర్టిస్టులను మాత్రమే కాదు, పబ్లిక్ లోసెలబ్రిటీగా మంచి క్రేజ్ తెచ్చుకున్న వారిని కూడా సంప్రదిస్తున్నారట. వారిలో దివ్వెల మాధురి(Divvela Madhuri) కూడా ఉన్నట్టు సమాచారం.
Also Read: టీడీపీ ఎమ్మెల్యే ఇంటి ముందు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ధర్నా..ఇదంతా వైసీపీ పనేనా?
రాజకీయాలను అనుసరించే వాళ్లకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాసరావు సతీమణి ఈమె. సోషల్ మీడియా లో బాగా పాపులర్. తన భర్త తో కలిసి ఈమె ఇచ్చిన ఇంటర్వ్యూస్ కూడా బాగా వైరల్ అయ్యాయి. మంచి రొమాంటిక్ కపుల్ గా వీళ్లిద్దరికీ పేరుంది. వైసీపీ పార్టీ లో ఉన్నంత కాలం పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ లపై దువ్వాడ చేసిన కామెంట్స్ ఎలాంటివో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో ఆయన నారా లోకేష్ ని పొగడడం తో జగన్ పార్టీ నుండి సస్పెండ్ చేసాడు. అలాంటి వ్యక్తి కి సంబంధించిన భార్య బిగ్ బాస్ లోకి వస్తుందంటే ఆమె పై మొదటి నుండే నెగటివిటీ తారా స్థాయిలో ఉంటుంది. మరో ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే మాధురి తో పాటు దువ్వాడ కూడా ఈ షో లో పాల్గొనే అవకాశం ఉందట.