Samantha: సమంత ప్రశ్నకు జవాబు ఉందా?

సినిమాలు, వెబ్ సిరీస్ లు అని తేడా లేకుండా ఇండస్ట్రీలో మొన్నటి వరకు బిజీగా ఉండేది సమంత. కానీ ఇప్పుడు ఈమె కాస్త రిలాక్స్ అయినట్లు తెలుస్తోంది.

Written By: Chai Muchhata, Updated On : August 6, 2023 1:22 pm

Samantha

Follow us on

Samantha: టాలీవుడ్ హీరోయిన్ సమంత సినిమాల్లో తక్కువగా కనిపిస్తున్నా.. సోషల్ మీడియాలో మాత్రం ట్రెండీగా ఉంటున్నారు. ఆమెకు గురించి చాలా మంది రకరకాల పోస్టులు పెట్టి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సమంత మయసైటిస్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇందు కోసం కొన్ని రోజులు ఆమె ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వచ్చాయి. అయితే తాజాగా సమంత వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. జలపాతాల దగ్గర ఉన్న కొన్ని ఫొటోలు సందడి చేస్తున్నాయి. అయితే త్వరలో ఆమె మయోసైటిస్ చికిత్స కోసం అమెరికా వెళ్తున్న విషయాన్ని చెప్పింది. దీనిని ఆసరాగా తీసుకున్న కొందరు ఆమె గురించి బ్యాడ్ గా ప్రచారం చేశారు. దీనిపై సమంత రియాక్షన్ ఇచ్చింది. ఇంతకీ ఏంటా స్టోరీ..?

సినిమాలు, వెబ్ సిరీస్ లు అని తేడా లేకుండా ఇండస్ట్రీలో మొన్నటి వరకు బిజీగా ఉండేది సమంత. కానీ ఇప్పుడు ఈమె కాస్త రిలాక్స్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఆమె త్వరలో మయోసైటిస్ చికిత్స కోసం అమెరికా వెళ్తున్నారు. అయితే కొందరు సమంత చికిత్స కు రూ.25 కోట్లు అవసరం ఉంటుందని, ఆ డబ్బును ఓ స్టార్ హీరో సాయం చేస్తున్నాడని ప్రచారం చేశారు. సాధారణంగా ఇలాంటి ప్రచారాలను పట్టించుకోని సమంత తన ఆరోగ్యంపై బ్యాడ్ గా చెప్పేసరికి ఆమెకు విపరీతమైన కోపం వచ్చింది. దీంతో ఆమె ఇన్ స్ట్రాగ్రామ్ వేదికగా అసలు విషయాన్ని వెల్లడించింది.

‘నా గురించి కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నారు. మయోసైటిస్ వ్యాధి కాదు.. ఒక సమస్య. ఇది వేల మందికి ఉంది. అయితే ఈ చికిత్స కోసం రూ.25 కోట్లు అవసరం ఉంటుందా? దీనిని ఓ స్టార్ హీరో సాయం చేస్తున్నాడా? కొంత మంది ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం మానుకుంటే మంచిది.అయినా నేను సంపాదిస్తున్నా.. నాకున్న డబ్బులో ట్రీట్మెంట్ కు ఖర్చు పెట్టుకోగలను. ఆరోగ్య విషయంలో ఇలాంటి పోస్టులు పెట్టేవారికి కాస్త బాధ్యత ఉండాలి’ అని రిప్లై ఇచ్చింది.

అయితే సమంత పోస్టుపై ఆమె ఫ్యాన్స్ సపోర్టు చేస్తున్నారు. సమంత ఒకరి దగ్గర అప్పు చేయాల్సిన అవసరం లేదని, ఆమె గురించి కొందరు బ్యాడ్ గా ప్రచారం చేయాలని పనిగట్టుకున్నారని అంటున్నారు. అయితే అసలు విషయం తెలియకుండా చాలా మంది ఇలా ప్రచారం చేయడం భావ్యం కాదని కామెంట్స్ పెడుతున్నారు. అయితే సమంత త్వరగా ఈ సమస్య నుంచి కోలుకోవాని కోరుతున్నారు.