Pushpa 2 : అక్షరాలా 1065 కోట్లు..విడుదలకు ముందే #RRR అవుట్..అనితర సాధ్యమైన రికార్డుని నెలకొల్పిన ‘పుష్ప 2’!

పుష్ప 2 చిత్రానికి, ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిగింది. కేవలం థియేట్రికల్ రైట్స్ బిజినెస్ అన్ని భాషలకు కలిపి 600 కోట్ల రూపాయలకు జరిగిందట. తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 220 కోట్ల రూపాయలకు జరిగినట్టు తెలుస్తుంది. #RRR చిత్రానికి కూడా ఇదే స్థాయి బిజినెస్ జరిగింది. ఇక నార్త్ ఇండియా లో ఈ సినిమా బిజినెస్ ని ఇప్పట్లో ఏ హీరో కూడా ముట్టుకోలేడు అని చెప్పొచ్చు.

Written By: Vicky, Updated On : October 21, 2024 6:41 pm

Pushpa 2

Follow us on

Pushpa 2 :  దేశంలో ఉన్న సినీ అభిమానులు మొత్తం ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 : ది రూల్’ కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు సరసమైన క్రేజ్ ని ఏర్పాటు చేసుకున్న ఈ చిత్రానికి, ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిగింది. కేవలం థియేట్రికల్ రైట్స్ బిజినెస్ అన్ని భాషలకు కలిపి 600 కోట్ల రూపాయలకు జరిగిందట. తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 220 కోట్ల రూపాయలకు జరిగినట్టు తెలుస్తుంది. #RRR చిత్రానికి కూడా ఇదే స్థాయి బిజినెస్ జరిగింది. ఇక నార్త్ ఇండియా లో ఈ సినిమా బిజినెస్ ని ఇప్పట్లో ఏ హీరో కూడా ముట్టుకోలేడు అని చెప్పొచ్చు.

పుష్ప పార్ట్ 1 నార్త్ ఇండియా ని మొత్తం షేక్ చేసింది. కేవలం మూడు కోట్ల రూపాయిల ఓపెనింగ్ వసూళ్లతో మొదలైన ఈ సినిమా ఫుల్ రన్ లో 120 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది. అందుకే పార్ట్ 2 బిజినెస్ ఆకాశాన్ని అంటింది. అక్కడి ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా హిందీ వెర్షన్ థియేట్రికల్ రైట్స్ 200 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు చెప్తున్నారు. అంటే ఈ సినిమా హిందీ వెర్షన్ సూపర్ హిట్ అవ్వాలంటే 200 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు, అలాగే 300 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టాలి. కల్కి చిత్రం ఫుల్ రన్ కలెక్షన్స్ కూడా హిందీ లో ఇంతగా రాలేదు. అలాగే తమిళనాడు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 50 కోట్ల రూపాయలకు జరగగా, కర్ణాటక 30 కోట్లు, కేరళ 20 కోట్లు, ఓవర్సీస్ లో 120 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

మొత్తం మీద 600 కోట్ల రూపాయిల బిజినెస్ అన్ని భాషలకు కలిపి వరల్డ్ వైడ్ గా జరిగిందన్నమాట. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 640 కోట్ల రూపాయలకు పైగా షేర్ రావాల్సిందే. కల్కి, #RRR చిత్రాలకు 550 కోట్ల రూపాయిల రేంజ్ లో షేర్ వసూళ్లు వచ్చాయి. కానీ పుష్ప 2 బిజినెస్ ఆ రెండు సినిమాల కలెక్షన్స్ కంటే ఎక్కువ ఉండడం గమనార్హం. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే డిజిటల్ రైట్స్ అన్ని భాషలకు కలిపి 275 కోట్లు, ఆడియో రైట్స్ 65 కోట్లు, సాటిలైట్ రైట్స్ 85 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు ట్రేడ్ పండితులు చెప్తున్నారు. మొత్తం మీద థియేట్రికల్ + నాన్ థియేట్రికల్ రైట్స్ కలిపి ఈ సినిమాకి 1065 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది. అలా విడుదలకు ముందే వెయ్యి కోట్ల రూపాయిలు అందుకున్న మొట్టమొదటి ఇండియన్ సినిమాగా ‘పుష్ప 2 ‘ చరిత్ర సృష్టించింది.