Bigg Boss 8′ contestant Naga Manikantha : బిగ్ బాస్ 8′ కంటెస్టెంట్ నాగ మణికంఠ కి ఇష్టమైన హీరో అతనేనా..? హౌస్ లోకి వెళ్లేముందే మాస్టర్ ప్లాన్ వేసుకున్నాడుగా!

ఈ షో కేవలం ఒక ఛాయస్ అవ్వొచ్చు, కానీ నాకు ఇది లైఫ్ అని చెప్పుకొని ఏడ్చేస్తాడు. ఆ తర్వాత మణికంఠ ని అనిల్ రావిపూడి బయటకి తీసుకెళ్తూ 'నీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు?' అని అడుగుతాడు. దానికి మణికంఠ సమాధానం చెప్తూ 'నాకు నేనే ఫ్యాన్ సార్' అని అంటాడు.

Written By: Vicky, Updated On : October 21, 2024 6:54 pm

Naga Manikantha

Follow us on

Bigg Boss 8′ contestant Naga Manikantha : ఈ సీజన్ బిగ్ బాస్ షో ద్వారా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిన నాగ మణికంఠ బిగ్ బాస్ హౌస్ నుండి సెల్ఫ్ ఎలిమినేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఇక నుండి తాను గేమ్స్ ఆడలేనని, నా పని అయిపోయిందని, నేను ఆడలేని పరిస్థితికి వచ్చినప్పుడు హౌస్ లో కొనసాగడం కరెక్ట్ కాదని, నా బదులుగా వేరే వాళ్లకు ఛాన్స్ ఇస్తే ముందుకు పోతారని, ఆ ఉద్దేశ్యంతోనే ఎలిమినేట్ అవ్వాలని అనుకున్నాను అంటూ ఆయన నాగార్జున కి చెప్పి ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం గౌతమ్ ఎలిమినేట్ అయ్యినట్టుగా చూపించారు, కానీ ఇందులో పెద్ద కాంట్రవర్సీ నడుస్తున్న సంగతి తెలిసిందే.

ఇదంతా పక్కన పెడితే నాగ మణికంఠ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు, హౌస్ మేట్స్ ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ అయ్యినట్టు ఆయనతో పాటు హౌస్ లోకి వచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్తాడు. దీనికి నాగ మణికంఠ చాలా ఎమోషనల్ అయిపోతాడు. మీకు బయటకి వెళ్తే వేరే అవకాశాలు ఉన్నాయి, మీకు ఈ షో కేవలం ఒక ఛాయస్ అవ్వొచ్చు, కానీ నాకు ఇది లైఫ్ అని చెప్పుకొని ఏడ్చేస్తాడు. ఆ తర్వాత మణికంఠ ని అనిల్ రావిపూడి బయటకి తీసుకెళ్తూ ‘నీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు?’ అని అడుగుతాడు. దానికి మణికంఠ సమాధానం చెప్తూ ‘నాకు నేనే ఫ్యాన్ సార్’ అని అంటాడు. అది విన్న తర్వాత మణికంఠ కి నిజంగా ఇష్టమైన హీరో ఎవ్వరూ లేరని అందరూ అనుకున్నారు. కానీ ఈయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పెద్ద వీరాభిమాని అని ఆయన ఇంస్టాగ్రామ్ అకౌంట్ పరిశీలిస్తే తెలిసింది. బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ 1 వ తేదీన ప్రారంభం అయ్యింది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే మణికంఠ అప్పటికే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పటికీ కూడా ఆయన పీఆర్ టీం శుభాకాంక్షలు తెలియచేస్తూ ఒక పోస్ట్ పెట్టారు.

దానిదేముంది పెద్ద హీరో కదా, అందుకే పెట్టి ఉండొచ్చేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఇంకా వెనక్కి వెళ్లి చూస్తే ఆయన చిరంజీవి పుట్టినరోజు కి, మహేష్ బాబు పుట్టిన రోజుకి శుభాకాంక్షలు తెలియచేయలేదు. కానీ పవన్ కళ్యాణ్ కి మాత్రం ప్రత్యేకంగా చేసాడు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు, ఆయన పవన్ కళ్యాణ్ అభిమాని అని. అయితే ఇది కూడా స్ట్రాటజీ అయ్యుండొచ్చు అని కొంతమంది సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానుల ఓట్ల కోసం మణికంఠ ఇలా చేసి ఉండొచ్చని అంటున్నారు, కానీ మణికంఠ ఇప్పటి దాకా అందరూ అనుకుంటున్నట్టు డ్రామాలు చేసే వ్యక్తి కాదు, అతను నిజంగానే అలా ఉంటాడు అనే విషయం సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకున్నప్పుడే అందరికీ అర్థం అయ్యింది. కాబట్టి ఆయన నిజంగానే పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పొచ్చు.