https://oktelugu.com/

Pawan Kalyan: రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదలు తగ్గాయి..ఇక పవన్ కళ్యాణ్ అభిమానుల కోరిక నెరవేరుతుందా?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అధికార యంత్రాంగాన్ని తన పరిధిమేర ఎలా పరుగులు పెట్టించాడో మన అందరికీ తెలిసిందే. డిజాస్టర్ మ్యానేజ్ మెంట్ కేంద్రానికి వచ్చేసి, హోమ్ మినిస్టర్ అనిత తో ఆయన చర్చలు జరిపి, సహాయ సహకారాలు ఎలా అందుతున్నాయి అనేది పరిశీలించాడు.

Written By:
  • Vicky
  • , Updated On : September 10, 2024 / 12:44 PM IST

    Pawan Kalyan(9)

    Follow us on

    Pawan Kalyan: రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం సృష్టించిన విద్వంసం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికీ ఈ వరద నుండి పూర్తి స్థాయిలో విజయవాడ కోలుకోలేదు కానీ, వరద ఉదృతి అయితే పూర్తిగా తగ్గింది. వర్షాలు కూడా ఆగిపోయాయి, చాలా రోజుల తర్వాత సూర్యుడిని చూస్తున్నారు జనాలు. మరో రెండు రోజుల్లో మొత్తం మామూలు స్థాయికి వచ్చే అవకాశాలు ఉంది. ఇదంతా పక్కన పెడితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అధికార యంత్రాంగాన్ని తన పరిధిమేర ఎలా పరుగులు పెట్టించాడో మన అందరికీ తెలిసిందే. డిజాస్టర్ మ్యానేజ్ మెంట్ కేంద్రానికి వచ్చేసి, హోమ్ మినిస్టర్ అనిత తో ఆయన చర్చలు జరిపి, సహాయ సహకారాలు ఎలా అందుతున్నాయి అనేది పరిశీలించాడు.

    అక్కడితో ఆయన ఆగిపోలేదు, ఏకంగా 5 కోట్ల రూపాయిల డబ్బులను ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రత్యేకంగా అందించాడు. వీటితో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి కూడా ఆయన కోటి రూపాయిల విరాళం అందించాడు. నిన్న కూడా ఆయన కాకినాడ లో పర్యటించి వరదకు ముంపు ప్రాంతాలను సందర్శించాడు. అలా తన బాధ్యతలను ఎంతో జాగ్గ్రత్తగా నిర్వహిస్తూ పవన్ కళ్యాణ్ ఎంతో మంది రాజకీయ నాయకులకు స్ఫూర్తిగా నిలిచాడు. మరో విశేషం ఏమిటంటే, ఆయన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాలకు సంబంధించిన పోస్టర్స్ ని సెప్టెంబర్ 2 న విడుదల చేయాలనీ అభిమానులు చాలా కోరుకున్నారు. మేకర్స్ విడుదల చేసేవారు కూడా. కానీ రాష్ట్రం ఇన్ని కష్టాల్లో ఉన్నప్పుడు కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడం కరెక్ట్ కాదని, ప్రస్తుతానికి ఆపేయండి అని, వేరే మంచి రోజు చూసి విడుదల చేద్దాం అని చెప్పడం తో మేకర్స్ ఆయన మాటకు గౌరవం ఇచ్చి వెనక్కి తగ్గారు. ఇప్పుడు రాష్ట్రం మాములు స్థితికి వచ్చింది, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ గా ఉన్నారు, కనీసం ఇప్పటికైనా ‘ఓజీ’ మూవీ కి సంబంధించిన అప్డేట్ ఇవ్వమని అభిమానులు ట్విట్టర్ లో నిర్మాతలను ట్యాగ్ చేస్తూ ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి సెప్టెంబర్ 2 వ తారీఖున ఓజీ చిత్రం నుండి మొదటి లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేద్దాం అని అనుకున్నారు.

    కానీ అప్పటికీ ఇంకా పని పూర్తి కాకపోవడంతో, ఒక మంచి స్టైలిష్ పోస్టర్ తో సాంగ్ విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పారు. కానీ అది కూడా పవన్ కళ్యాణ్ వద్దు అని చెప్పడం తో ఆపేసారు. అయితే ఇప్పుడు ఆ సాంగ్ కి సంబంధించిన పోస్టర్ ని విడుదల చేయమని అభిమానులు నిర్మాతలపై బలమైన ఒత్తిడి పెడుతున్నారు. మరి మేకర్స్ వాళ్ళ వత్తిడికి దిగొచ్చి సాంగ్ అప్డేట్ కి సంబంధించిన పోస్టర్ ని విడుదల చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ పాటని ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో శింబు పాడినట్టు తెలుస్తుంది. గతంలో కూడా ఆయన తెలుగులో పలు సూపర్ హిట్ సాంగ్స్ పాడాడు.