https://oktelugu.com/

Simbu: ‘ఓజీ’ కి ఇచ్చిన రెమ్యూనరేషన్ ని విజయవాడ వరద బాధితులకు ఇచ్చేసిన తమిళ హీరో శింబు!

రీసెంట్ గానే ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఓజీ' చిత్రంలో ఒక పాట పాడాడు. ఈ పాట పాడినందుకు మేకర్స్ ఆయనకీ రెమ్యూనరేషన్ ఇవ్వబోతే ఆయన తీసుకోలేదు. ఇది నేను కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానం తో మాత్రమే పాడానని, దానికి ఎలాంటి రెమ్యూనరేషన్ అవసరం లేదని నిర్మాతలకు చెప్పాడట.

Written By:
  • Vicky
  • , Updated On : September 10, 2024 / 12:51 PM IST

    Simbu

    Follow us on

    Simbu: రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన వరదల కారణంగా జనాలు పడిన అవస్థలు ఎలాంటివో ఇన్ని రోజులు మనం టీవీ లలో పేపర్స్ లో చూస్తూనే ఉన్నాం. విజయవాడ ప్రాంతం మొత్తం సగానికి పైగా నీట మునిగింది. సుమారుగా 400 గ్రామాలూ ఇంకా నీటిలోనే ఉన్నాయి. అలాంటి పరిస్థితిని అర్థం చేసుకున్న మన టాలీవుడ్ హీరోలు ఒక్కొక్కరిగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధులకు భారీ మొత్తంలో విరాళం అందించి తమ విశాల హృదయాన్ని చాటుకున్నారు. ఇప్పుడు తమిళ హీరోల వంతు మొదలైంది. మన టాలీవుడ్ లో అద్భుతమైన మార్కెట్ ఉన్నటువంటి రజినీకాంత్, సూర్య, కమల్ హాసన్ వంటి వారు ఇప్పటి వరకు వరద నష్టానికి ఒక్క పైసా కూడా డొనేషన్ అందించలేదు. కానీ టాలీవుడ్ లో మార్కెట్ లేని శింబు మాత్రం రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి చెరో 7 లక్షల రూపాయిలు డొనేషన్ అందించాడు.

    రీసెంట్ గానే ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ చిత్రంలో ఒక పాట పాడాడు. ఈ పాట పాడినందుకు మేకర్స్ ఆయనకీ రెమ్యూనరేషన్ ఇవ్వబోతే ఆయన తీసుకోలేదు. ఇది నేను కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానం తో మాత్రమే పాడానని, దానికి ఎలాంటి రెమ్యూనరేషన్ అవసరం లేదని నిర్మాతలకు చెప్పాడట. కానీ నిర్మాతలు పదే పదే రిక్వెస్ట్ చేయడం తో వాళ్ళ కోసం రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. ఆ తీసుకున్న రెమ్యూనరేషన్ లో 14 లక్షల రూపాయిలు వరద బాధితులకు విరాళం అందించడం ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది. శింబు మనసు ఎంత గొప్పదో మరోసారి అందరికీ అర్థం అయ్యేలా చేసింది ఈ ఘటన. శింబు తెలుగు ఆడియన్స్ కి ‘మన్మధ’ చిత్రం ద్వారా పరిచయం అయ్యాడు. ఆ సినిమా తమిళం లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో, తెలుగులో అంతకు మించి హిట్ అయ్యింది. ఇక ఆ తర్వాత శింబు నటించిన అనేక తమిళ సినిమాలు తెలుగు లో దబ్ అయ్యాయి కానీ, అవి అనుకున్న స్థాయిలో ఆడలేదు. అలాంటి సమయంలో వచ్చిన ‘వల్లభ’ చిత్రం మరోసారి శింబు కెరీర్ ని ఒక కీలక మలుపు తిప్పింది.

    తమిళం తో పాటుగా, తెలుగు లో కూడా ఈ సినిమా బంపర్ వసూళ్లను సాధించి సూపర్ హిట్ గా నిల్చింది. ఇక ఆ తర్వాత శింబు సినిమాలు పెద్దగా ఆడలేదు, తెలుగు లో కూడా దబ్ అవ్వడం మానేశాయి. కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు, వరుసగా మూడు హిట్ సినిమాలతో తమిళం లో మళ్ళీ తన మార్కెట్ ని నిలబెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్ అని చెప్పిన శింబు, ఆయన సినిమాలో పాట పాడే అవకాశం వచ్చినందుకు ఇప్పుడు ఎంతో సంతోషిస్తున్నాడు. అంతే కాకుండా ఆయన సినిమా ద్వారా వచ్చిన డబ్బులను వరద బాధితులకు పంచడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.