https://oktelugu.com/

Credit card : క్రెడిట్ కార్డు విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా? అయితే సిబిల్ స్కోర్ అస్సలు పెరగదు..

క్రెడిట్ కార్డుపై వారి ఆదాయాన్ని బట్టి క్రెడిట్ లిమిట్ ఇస్తుంటారు. అయితే బ్యాంకు ఇచ్చిన లిమిట్ లో కొందరు అవగాహన లేకుండా 80 శాతం వరకు ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి బ్యాంకు ఖాతాపై ప్రభావం పడుతుంది. అయితే క్రెడిట్ కార్డు లిమిట్ లో 30 శాతం మాత్రమే ఖర్చు చేస్తుండాలి.

Written By:
  • Srinivas
  • , Updated On : September 10, 2024 12:39 pm
    Credit card

    Credit card

    Follow us on

    Credit card : ఉద్యోగంతో పాటు వ్యాపారం చేసేవారు దాదాపు క్రెడిట్ కార్డును కలిగి ఉంటున్నారు. వస్తువుల కొనుగోలు తో పాటు తక్కువ వడ్డీతో రుణం తీసుకునే వారు క్రెడిట్ చాలా ఉపయోగపడుతుంది. అత్యవసర సేవలకు గానూ ఇది ఆపన్నహస్తం లా ఉంటుంది. అయితే క్రెడిట్ కార్డు ఎన్ని ప్రయోజనాలను కలిగిస్తుందో.. సరిగ్గా యూజ్ చేయకపోతే అంతే నష్టాలను తెస్తుంది. ముఖ్యంగా క్రెడిట్ కార్డు బిల్లులను చెల్లించే క్రమంలో కొందరు చాలా తప్పిదాలు చేస్తుంటారు. వాటి బిల్లులు సక్రమంగా చెల్లించకపోవడంతో పాటు ఖర్చుల విషయంలో అపరిమితంగా ఉపయోగిస్తుంటారు. దీంతో వారి సిబిల్ స్కోర్ పై ఈ ప్రభావం పడుతుంది. ఒక్కసారి సిబిల్ స్కోరుపై ఈ ప్రభావం ఉంటే ఇక క్రెడిట్ కార్డుపై ఉండే ప్రయోజనాలు తగ్గుతాయి. అయితే క్రెడిట్ కార్డు విషయంలో ఎలాంటి సూచలను పాటించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

    క్రెడిట్ కార్డుపై వారి ఆదాయాన్ని బట్టి క్రెడిట్ లిమిట్ ఇస్తుంటారు. అయితే బ్యాంకు ఇచ్చిన లిమిట్ లో కొందరు అవగాహన లేకుండా 80 శాతం వరకు ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి బ్యాంకు ఖాతాపై ప్రభావం పడుతుంది. అయితే క్రెడిట్ కార్డు లిమిట్ లో 30 శాతం మాత్రమే ఖర్చు చేస్తుండాలి. అలా చేయడం వల్ల వినియోగదారుడిపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. అలా కాకుండా అధికంగా కార్డును ఉపయోగిస్తే క్రెడిట్ స్కోరు పెరగకకుండా ఉంటుంది.

    క్రెడిట్ కార్డుపై వస్తువులు కొనుగోలు చేయడమే కాకుండా కార్డు లిమిట్ ఆధారంగా రుణాలు కూడా అందిస్తారు. అయితే ఈరుణాలు అవసరం ఉంటేనే తీసుకోవాలి. అలా కాకుండా జల్సాల కోసం తీసుకొని వాటిని సమయానికి చెల్లించకపోవడంతో రుణభారం పడుతుంది. దీంతో బిల్లు గడువు తేదీకి చెల్లించకపోవడంతో వడ్డీ భారం అధికంగా ఉంటుంది.

    చాలా మంది తమ సిబిల్ స్కోర్ కోసం పదే పదే దరఖాస్తు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇలా ఎక్కువ సార్లు దరఖాస్తు చేసుకోడం వల్ల క్రెడిట్ స్కోరుపై ప్రభావం పడుతుంది. అంతేకాకుండా బ్యాంకులకు ఖాతాదారునిపై నెగెటివ్ ప్రభావం పడుతుంది. దీంతో రివార్డులు తగ్గే ప్రమాదం ఉంది. బ్యాంకు రుణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. బ్యాంకు నుంచి తీసుకున్న రుణం కచ్చితంగా గడువులోగా చెల్లించాలి.అలా చేయని పక్షంలో రుణ నిష్పత్తి పెరిగి క్రెడిట్ స్కోరుపై ప్రభావం పడుతుంది.

    క్రెడిట్ కార్డుపై రుణం తీసుకున్నా.. బిల్లు చెల్లించకపోయినా.. ఫైన్ పడే అవకాశం ఉంది. అయితే ఈ విషయాలను వెంటనే తెలుసుకోవాలి. వీటిపై నిర్లక్ష్యంగా ఉంటే ఈ ప్రభావం క్రెడిట్ స్కోరుపై పడుతుంది. అంతేకాకుండా ఒకసారి చేసిన పొరపాటును సరిదిద్దుకొని మరోసారి చేయకుండా జాగ్రత్త పడాలి. గడువుతేదీలోగా క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించకపోతే దాదాపు 36 శాతం వడ్డీ పడే అవకాశం ఉంది. ఒక్కసారి ఈ ఫెనాల్టీ విధిస్తే చాలా రోజుల వరకు క్రెడిట్ స్కోరు పెరగకుండా ఉంటుంది. అంతేకాకుండా క్రెడిట్ కార్డును ఎప్పటికప్పుడు యాక్టివేట్ అయ్యే విధంగా మినిమం ఖర్చు చేస్తూ ఉండాలి. లేకుంటే ఇది హోల్డ్ లో పడిపోతే రి యాక్టివేట్ అవడం చాలా కష్టం.