Ravi Teja and Ram Charan : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక అందులో భాగంగానే కొంతమంది కష్టపడి మరి సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా రాణించి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నారు. నిజానికి అలాంటి హీరోలు సినిమా ఇండస్ట్రీలో ఉండటం నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. ఇక మెగాస్టార్ చిరంజీవి తన స్వశక్తితో ఇండస్ట్రీలో రాణిస్తుంటే రవితేజ కూడా చిరంజీవి బాటలో నడిచి స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక ఏది ఏమైనా కూడా రవితేజ లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక చెరగని ముద్ర వేశారనే చెప్పాలి. ఇక తన కెరియర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించిన ఆయన సగటు ప్రేక్షకుడి అభిమానాన్ని పొందడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని కూడా క్రియేట్ చేసుకున్నాడు… ఇక ఏది ఏమైనా కూడా ఆయన చేస్తున్న సినిమాలన్నీ ప్రేక్షకులను విపరీతంగా అలరించడమే కాకుండా ఆయనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా సంపాదించి పెట్టాయనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ సైతం తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడమే కాకుండా తన మార్కెట్ ను కూడా అంతకంతకు పెంచుకుంటూ వస్తున్నాడు…ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్, రవితేజ కాంబినేషన్ లో రావాల్సిన ఒక భారీ మల్టీస్టారర్ సినిమా మిస్ అయిందనే విషయం చాలామందికి తెలియదు.
బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అయిన ‘బోల్ బచ్చన్’ సినిమాని తెలుగులో రవితేజ, రామ్ చరణ్ లను హీరోలుగా పెట్టి చేద్దామనే ఆలోచనలో ప్రొడ్యూసర్స్ అయితే ఉన్నారు. కానీ అనుకోకుండా సురేష్ బాబు ఈ సినిమా రైట్స్ ని తీసుకోవడం దాంతో వెంకటేష్ రామ్ లను పెట్టి ఈ సినిమాని తెరకెక్కించారు.
ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆశించిన మేరకు ఆకట్టుకోలేకపోయింది. కారణం ఏదైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటడం లో ఈ సినిమా మాత్రం వెనుకబడిపోయిందనే చెప్పాలి. ఇక ఈ సినిమా ఫ్లాప్ అయినందుకు అటు రవితేజ, ఇటు రామ్ చరణ్ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కానీ వీళ్ళ కాంబోలో ఒక సినిమా మిస్ అయిందనే బాధను కూడా వెలిబుచుతున్నారు. మరి ఇప్పటికైనా వీళ్ళ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే చూడాలని యావత్ తెలుగు సినిమా అభిమానులంతా కోరుకుంటున్నారు. మరి తొందర్లోనే వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటూ పలువురు దర్శకులు తెలియజేస్తున్నారు…