Fish Venkat : ఎన్నో సినిమాల్లో విలన్ గా క్యారక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా నటించి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులను విశేషం గా అలరించిన ఫిష్ వెంకట్(Fish Venkat) పరిస్థితి ప్రస్తుతం అత్యంత దయనీయంగా మారింది. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఫిష్ వెంకట్, తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ ఉన్నాడు. ఇతని ఆరోగ్య పరిస్థితి ని తెలుసుకొని మెగాస్టార్ చిరంజీవి ఒకసారి సహాయం అందించాడు. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కూడా ఫిష్ వెంకట్ పరిస్థితి ని తెలుసుకొని తన పార్టీ ఆఫీస్ కి పిలిపించి, ఆయనకు అవసరమైన డబ్బులు ఇచ్చి,స్వయంగా తన డబ్బులతోనే శస్త్ర చికిత్స చేయించాడు. మూడు నెలల క్రితమే ఫిష్ వెంకట్ ఈ విషయాన్ని ఒక ప్రత్యేకమైన వీడియో ద్వారా తెలిపాడు. పోనిలే ఫిష్ వెంకట్ ఇకనైనా పూర్తిగా కోలుకుంటాడు, సంపూర్ణమైన ఆరోగ్యం తో తిరిగి వస్తాడు అని అందరూ అనుకున్నారు.
కానీ ఇప్పుడు ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. కుటుంబ సభ్యులు ఆయన్ని ప్రస్తుతం ప్రస్తుతం హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఫిష్ వెంకట్ వెంటిలేటర్ మీద ఉన్నాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్తున్నారు. ఫిష్ వెంకట్ రెండు కిడ్నీలు పాడు అవ్వడంతో గత వారం రోజులుగా ఆయనకు వెంటిలేటర్ మీదనే చికిత్స అందిస్తున్నారట. పాపం వైద్య ఖర్చుల కోసం ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులు ఎవరైనా సహాయం చేస్తారేమో అని ఎదురు చూస్తున్నారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ వరకు చేరదీస్తే కచ్చితంగా ఫిష్ వెంకట్ కి సహాయపడే అవకాశం ఉంది. దయచేసి ఈ విషయాన్ని మీ సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేయండి.
ఫిష్ వెంకట్ 2001 వ సంవత్సరం లో పవన్ కళ్యాణ్ ఖుషి చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఈయన ప్రముఖ దర్శకుడు VV వినాయక్ తెరకెక్కించిన ప్రతీ చిత్రం లోనూ ఒక కీలక పాత్ర పోషించేవాడు. ఆది, చెన్న కేశవ రెడ్డి,దిల్ ,కృష్ణ,అదుర్స్ ఇలా ఒక్కటా రెండా, దాదాపుగా వినాయక్ ప్రతీ సినిమాలోనూ నటించాడు. ఇక పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రం ఈయనకి తెచ్చిపెట్టిన పేరు మామూలుది కాదు. ముఖ్యంగా గబ్బర్ సింగ్ చిత్రం లో కబ్బడీ సన్నివేశం , అంత్యాక్షరి సన్నివేశం లో ఫిష్ వెంకట్ నటన అప్పట్లో ప్రేక్షకులను ఏ రేంజ్ లో నవ్వించాయి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గబ్బర్ సింగ్ చిత్రం తర్వాత ఏడాదికి పది నుండి 20 సినిమాల్లో నటించేంత బిజీ అయ్యాడు. కానీ ఈమధ్య కాలం లో ఆరోగ్య క్షీణించడంతో సినిమాలకు బాగా దూరం అయ్యాడు. ఇప్పుడు చూస్తే పరిస్థితి ఇలా తయారైంది పాపం.