Fish Venkat daughter comments: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్నో వందల సినిమాల్లో క్యారక్టర్ ఆరిస్టు గా చేసి, ఎంతో మంచి పేరు తెచ్చుకొని, చివరికి ఏ దిక్కు లేనివాడిలా చనిపోయిన ఫిష్ వెంకట్(Fish Venkat) ని చూస్తే ఎవరికైనా ఏడుపు రాకుండా తప్పదు. ఏడాదికి 20 కి పైగా సినిమాల్లో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడిపే ఫిష్ వెంకట్, అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరంగా ఉంటూ రావడం, ఆ తర్వాత ఆయన రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోయి, రీసెంట్ గానే హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో అత్యవసర చికిత్స కోసం హాస్పిటల్ చేరి వెంటిలేటర్ పై మరణం తో పోరాడుతూ చివరికి ప్రాణాలను వదిలేశాడు. అంతటి పాపులర్ నటుడు చనిపోతే, కనీసం ఒక్కరంటే ఒక్క సెలబ్రిటీ కూడా స్పందించకపోవడం అందరినీ ఎంతో బాధించింది. రీసెంట్ గా ఫిష్ వెంకట్ కూతురు ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఒక మీడియా ఛానల్ తో పంచుకుంది.
Also Read: ఇదేమి మేకోవర్ బాబోయ్..రామ్ చరణ్ ఫ్యాన్స్ కి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చిన బుచ్చి బాబు!
ఆమె మాట్లాడుతూ ‘నాన్నకు మొదట్లో కిడ్నీల సమస్య మాత్రమే ఉండేది. కానీ స్కానింగ్ తీసిన తర్వాత లివర్ కూడా పూర్తిగా చెడిపోయిందని, ఇక బ్రతకడం కష్టమేనని డాక్టర్లు చెప్పారు. మొన్నటి వరకు నాన్న బాగానే ఉన్నారు. 80 శాతం కోమాలో ఉన్నప్పటికీ, బ్రతుకుతారేమో అని ఆశ ఉండేది. కానీ అకస్మాత్తుగా ఆయన బీపీ ఆరోజు రాత్రి పడిపోయింది. శ్వాస అందలేదు,దీంతో ఆయన చనిపోవాల్సి వచ్చింది. ఇండస్ట్రీ నుండి మాకు నయాపైసా సహాయ సహకారాలు కూడా అందలేదు. విశ్వక్ సేన్, కృష్ణ మానినేని వంటి వారు సహాయం అందించారు. రామ్ చరణ్(Global Star Ram Charan) గారి కూతురు క్లిన్ కారా ఫౌండేషన్ నుండి పాతిక వేల రూపాయిలు మాత్రమే వచ్చాయి. రామ్ చరణ్ గారు ఫిష్ వెంకట్ ని మంచి హాస్పిటల్ లో చేర్పించారని, చికిత్స కి అయ్యే ఖర్చు మొత్తం ఆయనే భరిస్తున్నాడు అనే వార్త బాగా ప్రచారం అవ్వడం తో, అది నిజమే అని, సహాయం అందింది కదా అని చాలా మంది అనుకున్నారు’.
Also Read: అల్లు అర్జున్ తో నటించిన హీరోయిన్స్ పరిస్థితి ఇలా అయ్యిందేంటి..అయ్యో పాపం!
‘కానీ ఆ ప్రచారం నిజం కాదు. ఆ ప్రచారం కారణంగా మా నాన్న గారికి అందాల్సిన సహాయం అందలేదు. ఒకవేళ డబ్బులు ఉండుంటే నాన్న ఈరోజు కచ్చితంగా బ్రతికి ఉండేవారు. చికిత్స కి అవసరమయ్యే డబ్బులు లేకపోవడం వల్లే ఈరోజు ఆయన మాకు దూరం అయ్యారు. ఆయన చనిపోతే ఇండస్ట్రీ నుండి ఒక్కరు కూడా చూసేందుకు రాలేదు. కేవలం ‘గబ్బర్ సింగ్’ గ్యాంగ్ లో ఉండే నాన్న స్నేహితులు మాత్రమే మాతో మొదటి నుండి చివరి వరకు అందుబాటులో ఉంటూ వచ్చారు’ అని చెప్పుకొచ్చింది ఫిష్ వెంకట్ కూతురు. సోషల్ మీడియా లో జరిగే అబద్దపు ప్రచారాల వల్ల ఇలాంటి అనర్ధాలు ఎన్నో జరుగుతాయి,దయచేసి ఇకనైనా ఆపండి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు.