Ashish and Ashok Galla: 2022 సంక్రాంతి సినిమా ప్రియులకు నిరాశ మిగిల్చింది. ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్, భీమ్లా నాయక్ చిత్రాల వాయిదాతో అసలు మజా పోయింది. కరోనా ఆంక్షల నేపథ్యంలో బడా చిత్రాలు వరుసగా సంక్రాంతి రేసు నుండి తప్పుకున్నాయి. ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్ చిత్రాల వాయిదా ప్రకటన రాగానే నాగార్జున బరిలో దిగిపోయారు. రేయింబవళ్లు పని చేసి బంగార్రాజు చిత్రాన్ని సంక్రాంతికి సిద్ధం చేశారు. ఆయన ప్లాన్ ఫలించింది.

మిక్స్డ్ రివ్యూస్ మధ్య కూడా బంగార్రాజు రికార్డు వసూళ్లు రాబడుతుంది. సంక్రాంతి సీజన్ ని పూర్తిగా ఉపయోగించుకుంటూ భారీ కలెక్షన్స్ దిశగా పరుగులు పెడుతుంది. విడుదలైన మూడు రోజుల్లో 60-70 శాతం పెట్టుబడి రాబట్టేసింది. వీకెండ్ ముగిసే నాటికి బంగార్రాజు రూ. 43 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టినట్లు సమాచారం. అంటే దాదాపు బ్రేక్ ఈవెన్ కి దగ్గరైనట్లే. టాక్ తో సంబంధం లేకుండా నాగార్జున మూవీ చూడడానికి ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. సోగ్గాడే చిన్ని నాయనా పాజిటివ్ టాక్ తో భారీ వసూళ్లు రాబట్టింది. దాని సీక్వెల్ గా వచ్చిన బంగార్రాజు పై ప్రేక్షకులు ఆటోమేటిక్ గా చూడాలనే కోరిక కలిగి ఉన్నారు.
Also Read: బుల్లితెరపై కెరీర్ ప్రారంభించి వెండితెరను ఏలుతున్న సౌత్ స్టార్స్…!
బంగార్రాజు సంగతి ఇలా ఉంటే… యంగ్ హీరోల పరిస్థితి దారుణంగా ఉంది. ఈ సంక్రాంతికి ఇద్దరు వారసులు ఎంట్రీ ఇచ్చారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బంధువు ఆశిష్, మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా సంక్రాంతి బరిలో నిలిచారు. ఆశిష్ రౌడీ బాయ్స్, అశోక్ గల్లా హీరో బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాయి. ప్రేక్షకులు ఈ రెండు చిత్రాలపై ఎటువంటి ఆసక్తి చూపించడం లేదు.
బంగార్రాజు చిత్ర వసూళ్లతో పోల్చుకుంటే అసలు ఈ రెండు చిత్రాలు సోదీలో కూడా లేవు. పై పెచ్చు బాగా డబ్బున్న కుటుంబాలకు చెందిన వారసులు కావడంతో మార్కెట్ తో సంబంధం లేకుండా భారీగా ఖర్చుపెట్టారు. హీరో సినిమాకైతే ఓ స్టార్ హీరో సినిమా రేంజ్ లో తెరకెక్కించారు. ఫలితం దారుణంగా ఉన్న నేపథ్యంలో ఈ రెండు చిత్రాలు భారీ నష్టాలు మిగల్చడం ఖాయమని చెప్పాలి.
బంగార్రాజు మూవీ విడుదల కాకుంటే పరిస్థితి వేరేలా ఉండేది. రౌడీ బాయ్స్, హీరో చిత్రాల్లో ఒకటి మంచి వసూళ్లు దక్కించుకొని సంక్రాంతి విన్నర్ అయ్యేది. హడావుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున యువ హీరోలకు దెబ్బేశాడు.
Also Read: విరాట్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే వారసుడు అతనేనా..?
[…] Rajamouli: కరోనా ఆంక్షలతో ఏ పనీ ప్రణాళిక ప్రకారం సాగడం లేదు. సాధారణ రోజుల్లోనే నిర్మాతలు థియేటర్స్ సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. ఇక విడుదల తేదీలు వెనక్కిపోయి, సినిమాలు జామ్ అయితే పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్ ప్రస్తుత పరిస్థితి అలానే ఉంది. జనవరి నెలలో విడుదల కావాల్సిన పెద్ద చిత్రాలు ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్, భీమ్లా నాయక్ వాయిదా పడ్డాయి. భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. భీమ్లా నాయక్ ఆర్ ఆర్ ఆర్ నిర్మాతల ఒత్తిడితో సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంది. […]