Film Workers Strike: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక మంచి సినిమా చేయడానికి వాళ్ళు చాలా వరకు ప్రయత్నం చేస్తుంటారు. ఇక ఇదిలా ఉంటే దర్శకుడి యొక్క విజన్ ను ఫాలో అవుతూ సినిమా ఇండస్ట్రీలో ఉన్న సినీ కార్మికులందరు సినిమా కోసం కష్టపడుతూ ఉంటారు. సినిమా వెనకాల వాళ్ళు చేసిన కష్టం సినిమా చూస్తున్న ప్రతి ప్రేక్షకుడికి కనిపిస్తూ ఉంటుంది. మరి ఇలాంటి సందర్భంలోనే సినీ కార్మికులు వాళ్ళ వేతనాలను 30% పెంచాలని షూటింగ్స్ అన్నింటిని నిలిపివేసి ఒక సమ్మెను నిర్వహిస్తున్నారు. మరి ఈ సమ్మె మీద సినిమా ప్రొడ్యూసర్స్ అందరు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్లు అనుకున్నట్టుగా 30% వేతనాలను పెంచాలని అనుకున్నప్పటికి చిన్న నిర్మాతలకు ఇది చాలా ఇబ్బందిని కలిగిస్తుందని చిన్న నిర్మాతలు కొంత వరకు ప్రాబ్లమ్స్ ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. దాంతో సినీ కార్మికులకు వేతనాలను పెంచే అవసరం లేదని సినీ కార్మికుల ప్లేస్ లో సినిమాకు సంబంధించిన పనులు చేయగలిగిన నైపుణ్యం ఉన్న ఇతర వ్యక్తులు ఎవరినైనా సరే నియమించుకొని సినిమా పనులను పూర్తి చేసుకునే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే సినిమా ఇండస్ట్రీలో సినీ కార్మికులు లక్షలు పెట్టి కార్డు అయితే తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: శభాష్ సిరాజ్.. తండ్రి కష్టానికి గుర్తింపు తెచ్చావ్.. దేశాన్ని సగర్వంగా నిలబెట్టావ్!
అలా తీసుకున్న వాళ్లకి మాత్రమే ఇండస్ట్రీలో పనిని కల్పిస్తారు. ఇక ఇప్పుడు ప్రొడ్యూసర్లు తీసుకునే నిర్ణయాలను బట్టి ఎవరినైనా సరే సినీ కార్మికులుగా నియమించుకోవచ్చు. వాళ్లకు రోజువారి వేతనాలను చెల్లిస్తే సరిపోతుంది అంటూ ఈ నిర్ణయాన్ని తీసుకోవడంతో సినీ కార్మికుల్లో కొంతవరకు ఆవేదన అయితే వ్యక్తం అవుతోంది.
మరి మాకు కొంత అమౌంట్ పెంచితే మేము చాలా సంతోషంగా పని చేస్తాము అని చెప్పినప్పటికి చిన్న నిర్మాతల విషయంలో ఇది పెద్ద పెనుబారంగా మారుతుందనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇకమీదట సినీ కార్మికులకు కార్డు ఉండాల్సిన పని అయితే లేదు.
ఎవరికైతే చేయగలిగిన నైపుణ్యం ఉంటుందో వాళ్లందరి చేత పనిచేయించుకోడానికి సినిమా ప్రొడ్యూసర్లు రెడీగా ఉన్నామని చెప్పడంతో సినీ కార్మికులు చేస్తున్న సమ్మె ఇంకా కొనసాగుతుందా? లేదంటే విరమించుకుంటారా అనే దానిమీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు…