Filmfare Awards 2024: గత ఏడాది విడుదలైన బలగం ఒక సెన్సేషన్. కమెడియన్ వేణు దర్శకుడిగా మారి ఈ చిత్రం చేశారు. తెలంగాణ పల్లె నేటివిటీని అద్భుతంగా తెరపై చూపించాడు. పిట్ట ముట్టుడు అనే సాంప్రదాయం ప్రధానంగా తెరకెక్కిన బలగం ప్రేక్షకులను ఆకట్టుకుంది. బలగం ఇంత పెద్ద విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరో, హీరోయిన్స్ గా నటించారు. బలగం మూవీకి పలు విభాగాల్లో ఫిల్మ్ ఫేర్ అవార్డులు దక్కాయి.
Also Read: అల్లు అర్జున్ డ్రీమ్ రోల్ ఏంటో తెలుసా..? ఆయన ఆ పాత్రలో నటిస్తే రికార్డులు బ్రేక్ అవ్వాల్సిందే…
ఆగస్టు 2న హైదరాబాద్ వేదికగా 69వ శోభ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు, మలయాళ, కన్నడ, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా, వింధ్య విశాఖ వ్యాఖ్యాతలుగా వ్యవహారాలు. రాశి ఖన్నా, అపర్ణ బాలమురళి, సానియా ఇయాపాయ్, గాయత్రీ భరద్వాజ్ తమ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు. అనంతరం అవార్డుల ప్రకటన జరిగింది.
ఉత్తమ చిత్రంగా బలగం నిలిచింది. అలాగే ఉత్తమ దర్శకుడు అవార్డు సైతం బలగం చిత్రానికి దక్కింది. ఉత్తమ సహాయనటిగా బలగం చిత్రంలో నటించిన రూప లక్ష్మికి దక్కింది. మూడు విభాగాల్లో బలగం అవార్డులు అందుకుంది. దసరా సైతం అత్యధిక అవార్డులు కొల్లగొట్టింది. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ డెబ్యూ దర్శకుడు అవార్డులు ఆ చిత్రానికి దక్కాయి. నాని డీ గ్లామర్ రోల్ చేసిన దసరా మంచి విజయం అందుకుంది.
నాని నటించిన మరొక చిత్రం హాయ్ నాన్న సైతం అవార్డులు గెలుచుకోవడం విశేషం. తెలుగులో 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డులు సౌత్ 2024 విజేతల లిస్ట్ ఎలా ఉంది..
ఉత్తమ చిత్రం- బలగం
ఉత్తమ నటుడు- నాని-దసరా
ఉత్తమ నటి – కీర్తి సురేష్ -దసరా
ఉత్తమ దర్శకుడు- వేణు- బలగం
ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ – శ్రీకాంత్ ఓదెల – దసరా
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్)- బేబీ
ఉత్తమ నటి(క్రిటిక్స్)- వైష్ణవి చైతన్య-బేబీ
ఉత్తమ నటుడు(క్రిటిక్స్)-నవీన్ పోలిశెట్టి-మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, ప్రకాష్ రాజ్-రంగమార్తాండ
ఉత్తమ సహాయ నటుడు- రవితేజ-వాల్తేరు వీరయ్య, బ్రహ్మానందం-రంగమార్తాండ
ఉత్తమ సహాయ నటి- రూప లక్ష్మి- బలగం
ఉత్తమ గాయకుడు- శ్రీరామచంద్ర-బేబీ
ఉత్తమ గాయని-శ్వేత మోహన్- సార్
ఉత్తమ గేయ సాహిత్యం- అనంత్ శ్రీరామ్-బేబీ
ఉత్తమ సంగీతం- విజయ్ బుల్గానిన్-బేబీ
ఉత్తమ సినిమాటోగ్రఫీ- సూరన్-దసరా
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: కొల్లా అవినాష్-దసరా
ఉత్తమ కొరియోగ్రాఫర్-ప్రేమ్ రక్షిత్-దసరా
అత్యధికంగా దసరా మూవీ ఆరు విభాగాల్లో అవార్డులు అందుకోవడం విశేషం. పాన్ ఇండియా మూవీగా దసరా పలు భాషల్లో విడుదలైంది. డెబ్యూ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించాడు. స్నేహం, ప్రేమ, రివేంజ్ వంటి అంశాలు కలగలిపి అద్భుతంగా తెరకెక్కించారు. దసరా మూవీ నాని కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఉంది. కీర్తి సురేష్ ఒక బలమైన పాత్రలో అద్భుతంగా నటించింది. దసరా చిత్రం పలు విభాగాల్లో ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డ్స్ అందుకున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: రాజశేఖర్ ఆ ఒక్క మిస్టేక్ చేయకపోతే ఇప్పడు చిరంజీవి, బాలయ్య ల పక్కన నిలబడేవాడు…