ఎక్స్ క్లూజివ్ : ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా పోస్ట్ ఫోన్ !

త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కలయికలో రావాల్సిన ‘అయినను పోయి రావలె హస్తినకు’ సినిమా పోస్ట్ ఫోన్ అయింది. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో ఈ సినిమా చేద్దామనుకున్నారు. కానీ అది ఇప్పుడు సాధ్యమయ్యేలా కనబడటం లేదు. ఎన్టీఆర్ తన తరువాత సినిమాని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. ప్రశాంత్ సినిమా తరువాతే త్రివిక్రమ్ తో సినిమా చేస్తాడాట. అయితే త్రివిక్రమ్ సినిమా పోస్ట్ ఫోన్ అవ్వడానికి కారణం స్క్రిప్ట్ అని తెలుస్తోంది. […]

Written By: admin, Updated On : October 7, 2020 6:40 pm
Follow us on


త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కలయికలో రావాల్సిన ‘అయినను పోయి రావలె హస్తినకు’ సినిమా పోస్ట్ ఫోన్ అయింది. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో ఈ సినిమా చేద్దామనుకున్నారు. కానీ అది ఇప్పుడు సాధ్యమయ్యేలా కనబడటం లేదు. ఎన్టీఆర్ తన తరువాత సినిమాని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. ప్రశాంత్ సినిమా తరువాతే త్రివిక్రమ్ తో సినిమా చేస్తాడాట. అయితే త్రివిక్రమ్ సినిమా పోస్ట్ ఫోన్ అవ్వడానికి కారణం స్క్రిప్ట్ అని తెలుస్తోంది. స్క్రిప్ట్ పై త్రివిక్రమ్ – ఎన్టీఆర్ మధ్య చాలా రోజులుగా చర్చలు నడుస్తున్నాయని.. ప్రతి సీన్ ను త్రివిక్రమ్ తారక్ కు ఎక్స్ ప్లేన్ చేశాడని.. కాకపోతే స్క్రిప్ట్ లో ప్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్స్ విషయంలో ఎన్టీఆర్ కాస్త అనుమానం వ్యక్తం చేశాడట.

Also Read: యమలీల’లో మొదట హీరో మహేష్ బాబు అట !

ఈ సిట్టింగ్ తో దాదాపు స్క్రిప్ట్ లాక్ అయిపోతుందని భావించిన త్రివిక్రమ్ ఎన్టీఆర్ డౌట్ వ్యక్తం చేయడంతో వేరే కథకు వెళ్లదాం అని, ఈ లోపు మీరు ప్రశాంత్ నీల్ సినిమా పూర్తి చేయండి, ఆ తరువాత మనం కలిసి చేద్దాం అని త్రివిక్రమ్ తారక్ కి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కి ప్రతి సీన్ లో ఇన్ వాల్వ్ అవుతూ బెటర్ మెంట్ చేయడం అలవాటు. అరవింద సమేత సినిమాలో కూడా చాలా పాయింట్స్ తారక్ చెప్పినివే. అయితే ఆ సినిమాలో సలహాలు లాగా ఇచ్చిన తారక్, ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో మాత్రం కాస్త పట్టు పడుతున్నాడట. స్క్రిప్ట్ లో తారక్ ఎక్కువ ఇన్ వాల్వ్ అవుతున్నట్లు త్రివిక్రమ్ ఫీల్ అయ్యాడేమో. అందుకే సినిమాని పోస్ట్ ఫోన్ చేద్దామని ప్రతిపాదన పెట్టాడు. ఏది ఏమైనా వీరి కలయికలో మరో సినిమా వస్తే ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు.

Also Read: పవన్ కళ్యాణ్ సర్ ప్రైజ్.. ఫ్యాన్స్ కు పునకాలే..!

ఎందుకంటే ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేశారు, పైగా ఈ సినిమా కోసం త్రివిక్రమ్ నేటి భిన్నమైన రాజకీయ నేపథ్యం తీసుకున్నారు. తారక్ ను రాజకీయ నాయకుడిగా చూడాలని ఫ్యాన్స్ ఎప్పటినుండో ఆశ పడుతున్నారు. అన్నిటికి మించి ఈ సినిమాలో రాజకీయాలతో పాటు ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించబోతున్నారట. కమల్ కి భారతీయుడు సినిమా ఎలా నిలిచిపోయిందో.. ఎన్టీఆర్ కి ఈ సినిమా అలా నిలిచిపోతుందని అనుకున్నారు నందమూరి అభిమానులు. మరి రానున్న కాలంలోనైనా ఎన్టీఆర్ గనుక రాజకీయ నేపథ్యంలో సినిమా చేస్తే.. అది తెలుగు తమ్ముళ్లుకు మంచి ఎనర్జీని ఇస్తోంది.