https://oktelugu.com/

అంచెలంచెలుగా ఎదిగిన ‘తలైవా’..: నేడు రజనీ పుట్టిన రోజు..

స్టైల్ తో మైమరిపిస్తూ.. డైలాగ్ లతో ఉత్సాహం తెప్పిస్తూ.. సెంటిమెంట్ తో కన్నీళ్లను రప్పించే సినీ నటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ కు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఒక సినిమాలో హీరోకు కావాల్సిన లక్షణాలన్నీ రజనీలో ఉన్నాయి.. ట్రెండ్ కు తగ్గట్టూ తన రూపాన్ని మారుస్తూ నాటి సినీ ప్రేక్షకుల నుంచి నేటి యువతరాన్ని ఆకట్టుకునే ఈ ‘తలైవా’పుట్టిన రోజు నేడు. సామాన్య కుటుంబంలో పుట్టిన ఈ బస్ కండక్టర్ ఆసియాలోనే అత్యధిక పారితోషికం […]

Written By: , Updated On : December 12, 2020 / 09:23 AM IST
Follow us on

Superstar Rajinikath

స్టైల్ తో మైమరిపిస్తూ.. డైలాగ్ లతో ఉత్సాహం తెప్పిస్తూ.. సెంటిమెంట్ తో కన్నీళ్లను రప్పించే సినీ నటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ కు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఒక సినిమాలో హీరోకు కావాల్సిన లక్షణాలన్నీ రజనీలో ఉన్నాయి.. ట్రెండ్ కు తగ్గట్టూ తన రూపాన్ని మారుస్తూ నాటి సినీ ప్రేక్షకుల నుంచి నేటి యువతరాన్ని ఆకట్టుకునే ఈ ‘తలైవా’పుట్టిన రోజు నేడు. సామాన్య కుటుంబంలో పుట్టిన ఈ బస్ కండక్టర్ ఆసియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుడి స్థాయికి ఎదిగారు. దాదాపు 40 ఏళ్లకు పైగా సినీ జీవితాన్ని విజయవంతంగా పూర్తిచేసిన రజనీ త్వరలో రాజకీయంలో ఆరంగేట్రం చేస్తున్నారు. ఈ సందర్భంగా 70వ పుట్టిన రోజు జరుపుకుంటున్న రజనీకాంత్ కు అశేష జనవాహిని శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Also Read: నో ఎట్టి పరిస్థితుల్లో ముద్దు పెట్టాల్సిందే !

ఎన్నో ఆటుపోట్ల మధ్య రజనీ జీవితం ప్రారంభమైంది. రజనీ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. మహారాష్ట్రకు చెందిన రజనీ తల్లిదండ్రలు కర్ణాటకలోని బెంగుళూరులో స్థిరపడ్డారు. 1950 డిసెంబర్ 12 జన్మంచిన రజనీ తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో నాన్న, అన్నయ్యల మధ్య పెరిగాడు. మొదట కార్పెంటర్ గా ఇతర పనులు చేస్తూ జీవితాన్ని గడిపాడు. 1973లో ట్రాన్స్ ఫోర్ట్ సర్వీస్ లో బస్ కండక్టర్ గా ఉద్యోగంలో చేరారు.

నాటకాలపై ఆసక్తి ఉన్న రజనీ సినిమాలను బాగా చూసేవారు. ఓసారి నాటకం వేస్తున్న సమయంలో ప్రముఖ దర్శకుడు బాలచందర్ ద్రుష్టిలో పడ్డాడు. దీంతో ఆయనను తన ‘అపూర్వ రాగంగల్‘సినిమాలో పాత్రను ఇచ్చాడు. ఆ తరువాతయ ఆయనకు ‘రజనీకాంత్ ’ అని పేరు పెట్టాడు. మొదట నెగెటివ్ రోల్స్ లో కనినిపించిన రజనీ ఆ తరువాత తెలుగులో వచ్చిన ‘చిలుకమ్మ చెప్పింది’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. అయితే ‘భాషా’ చిత్రంతో రజనీ కమర్షియల్ గా పేరు సంపాదించాడు. అక్కడితో ఆగకుండా రజనీ మానియా కొనసాగింది. నాటి నుంచి నేటి వరకు యువతరాన్ని ఆకట్టుకుంటున్న రజనీ ఇప్పటికీ హీరో పాత్ర చేయడం విశేషం.

Also Read: సినిమాలు చేస్తే.. ఇక రాజకీయాలు ఎప్పుడు చేస్తారో..?

ఇక ‘రోబో’ సినిమాలో నేటి హీరోలు చేయలేని నటన చేశాడు. వయసు మీద పడినా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం రజనీ స్టైల్. దీంతో ఆయనకు మలేషియా, జపాన్ లో అభిమానులు విపరీతంగా ఉన్నారు. జపాన్ లోని జాకీచాన్ తరువాత రజనీని చేర్చడం ఆయనకున్న ప్రత్యేకత.

సినిమా జీవితంలో సంత్రుప్తి చెందిన రజనీ రాజకీయంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే పార్టీ స్థాపించిన ఆయన ఈనెల 31 పార్టీ విధివిధానాలను ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పోటీ పరిస్థితుల్లో రజనీ ఏ విధంగా ఆకట్టుకుంటాడోనన్న ఆసక్తి అందిరిలోనూ ఉంది. ఇప్పటి వరకు రాజకీయ అనుభవం లేని ఆయన గతంలో రాజకీయ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్