https://oktelugu.com/

చనిపోతాననే భయం వేసింది.. జీవితం విలువ తెలిసింది: తమన్నా

సౌత్ ఇండియాలోని టాప్ హీరోయిన్లలో మిల్కీబ్యూటీ తమన్నా ఒకరు. 15ఏళ్లకు పైగా సినిమాల్లో నటిస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తమన్నా నడుము అందాలకు చిన్న.. పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఫిదా అవాల్సిందే. కొద్దిరోజులుగా స్టార్ హీరోల పక్కన అవకాశాలు తగ్గినా తన గ్లామర్ తో ఎప్పటిలాగే అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల కరోనా బారినపడి తిరిగి కోలుకుంది. అయితే తనపై […]

Written By:
  • NARESH
  • , Updated On : November 9, 2020 / 06:21 PM IST
    Follow us on

    సౌత్ ఇండియాలోని టాప్ హీరోయిన్లలో మిల్కీబ్యూటీ తమన్నా ఒకరు. 15ఏళ్లకు పైగా సినిమాల్లో నటిస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తమన్నా నడుము అందాలకు చిన్న.. పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఫిదా అవాల్సిందే. కొద్దిరోజులుగా స్టార్ హీరోల పక్కన అవకాశాలు తగ్గినా తన గ్లామర్ తో ఎప్పటిలాగే అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల కరోనా బారినపడి తిరిగి కోలుకుంది. అయితే తనపై ఆ సమయంలో కొందరు నెగిటివ్ కామెంట్స్ చేయడం బాధ కలిగించిదని తమన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేసింది. కరోనా బారిన పడినపుడు తాను చనిపోతానేమోనని భయం వేసిందంటూ తమన్నా షాకింగ్ కామెంట్స్ చేసింది.

    Also Read: షూట్ ఆపొద్దు అంటున్న మెగాస్టార్ !

    కరోనా టెస్టుల్లో భాగంగా తనకు పాజిటివ్ రాగానే కంగారు పడ్డానని.. ఓ విధంగా ప్రాణభయం కలిగిందని వాపోయింది. అప్పటికే తనకు కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్నట్లు తెలిపింది. వైద్యులు.. తన తల్లిదండ్రులే తనను జాగ్రత్తగా కాపాడారని తెలిపింది. వాళ్ల వల్లే తాను ప్రాణాలతో ఉన్నట్లు చెప్పింది. ఈ భయంకర సమయంలోనే తనకు జీవితం ఎంత విలువైందో అర్థమైందని తమన్నా చెప్పింది.

    కరోనా నుంచి కోలుకున్నాక తనకు సంబంధించిన ఓ పిక్ సోషల్ మీడియాలో పెట్టగా కొందరు నెగిటివ్ కామెంట్స్ చేయడం బాధ కలిగిందని తెలిపింది. కరోనా ట్రీట్మెంట్లో భాగంగా వైద్యులు ఇచ్చిన మందులు తీసుకోవడంతో తాను కొంచెం లావుగా అయ్యానని తెలిపింది.

    Also Read: కొడుకు జైలుకు పంపినా పోతాను: స్టార్ హీరో తండ్రి

    అయితే కొందరు ఇవన్నీ తెలుసుకోకుండా లావుగా ఉన్నావంటూ ఇష్టమొచ్చినట్లు నెగిటివ్ కామెంట్స్ చేశారని పేర్కొంది. కరోనాను జయించిన సంతోషాన్ని కూడా లేకుండా కొందరు చేశారని ఆమె వాపోయింది. కొందరు జీవితం విలువ తెలుసుకోకుండా మాట్లాడటం ఏదిపడితే అది మాట్లాడాటం కొంచెం బాధకు గురిచేసిందని తెలిపింది.