AP Weather: ఏపీలో( Andhra Pradesh) భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవైపు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు వర్షాలు కూడా పడుతున్నాయి. ఈరోజు నుంచి రెండు రోజులపాటు ఏపీలో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ. ఏపీలోని 144 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీచేసింది. ఈనెల 27న కేరళకు రుతుపవనాలు తాకనున్నాయి. మరోవైపు రేపు అండమాన్ కు రుతుపవనాల రాక ప్రారంభం కానుంది. అయితే భిన్న వాతావరణ పరిస్థితులు నేపథ్యంలో ఏపీ ప్రజలు కాస్త అసౌకర్యానికి గురవుతున్నారు. ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో మూగజీవాలు సైతం ఇబ్బంది పడుతున్నాయి. రుతుపవనాల రాకతో ఏపీలో వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతటి వరకు వేడి వాతావరణం కొనసాగే పరిస్థితి ఉంది.
Also Read: జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న గుంటూరు నేతలు!
* 13న అండమాన్ కు రుతుపవనాలు..
ఈనెల 13న అండమాన్ నికోబార్( Andaman Nicobar) దీవులకు నైరుతీ రుతుపవనాలు ప్రవేశిస్తాయి. అటు తరువాత నాలుగు, ఐదు రోజుల్లో దక్షిణ అరేబియా సముద్రం, కొమరిన్ ప్రాంతం, దక్షిణ మధ్య బంగాళాఖాతం, అండమాన్ లో ఉన్న అన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించనున్నాయి. ఈనెల 27న కేరళకు దాఖలు ఉన్నాయి రుతుపవనాలు. సాధారణంగా జూన్ 1న రుతుపవనాల రాక ఉంటుంది. ఈసారి నాలుగు రోజుల ముందే రావడంతో వర్షాలు పడే ఛాన్స్ కనిపిస్తోంది. క్రమేపి దేశం మొత్తం ఇవి విస్తరిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
* ఉడికిపోతున్న రాయలసీమ..
మరోవైపు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు( temperatures ) నమోదయ్యాయి. రాయలసీమలోని పలుచోట్ల వేడి వాతావరణం కొనసాగుతోంది. ఉత్తర కోస్తాలో పలుచోట్ల వడగాల్పులు వీచాయి. కోస్తాలో అనేకచోట్ల ఆకాశం నిర్మలంగా ఉండడం.. వాయువ్య భారతం నుంచి వీచిన పొడిగాలులతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 144 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెరిగిన ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
* 43 డిగ్రీలకు పైగా..
శ్రీకాకుళం జిల్లా( Srikakulam district) నుంచి అనంతపురం జిల్లా వరకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల, శ్రీకాకుళం జిల్లా జగ్గిలి బొంతులో 42.2 డిగ్రీలు, తిరుపతి జిల్లా ఓజిలి, అల్లూరి జిల్లా ఎర్రం పేటలో 41.8, ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు లో 41.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. రాయలసీమతో పాటు కోస్తాలో అక్కడక్కడ పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసాయి. సోమవారం 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలోని 29 మండలాల్లో తీవ్రంగా.. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, కృష్ణా జిల్లాలోని మరో 41 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. మరోవైపు అనంతపురం, సత్యసాయి, కడప జిల్లాలో చెదురు మదురుగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. కోస్తాలో మాత్రం ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది.