Fauji : కాశ్మీర్ లో ముష్కరులు అమాయకులైన టూరిస్ట్స్ ని కాల్చి చంపిన ఘటన మన భారత దేశాన్ని మాత్రమే కాదు, యావత్తు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ముష్కరులను ఉపేక్షించేది లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా వంటి వారు మీడియా ద్వారా తెలియజేసిన సంగతి అందరికీ తెలిసిందే. అంతే కాకుండా పాకిస్థాన్ కి మన భారత్ నుండి వెళ్తున్న ఇండస్ జలాలను కూడా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా ఎన్నో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ పాకిస్థాన్ ని కుదేలు చేసే దిశగా భారత ప్రభుత్వం అడుగులు వేస్తున్న నేపథ్యం లో ప్రభాస్(Rebel Star Prabhas) ‘ఫౌజీ'(Fauji Movie) మూవీ హీరోయిన్ ఇమాన్వి(Imanvi ismael) వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే ఈమె పాకిస్థాన్ అమ్మాయి అని, ఆమె తండ్రి గతంలో పాకిస్తాన్ మిలటరీ లో పని చేసాడని, తక్షణమే ఈమెను సినిమా నుండి తొలగించాలి అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియా లో డిమాండ్ ఏర్పడింది.
Also Read : ప్రభాస్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ.. ఏకంగా యువరాణిగా పట్టాభిషేకం చేశారుగా
దీనిపై ఇమాన్వి తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘ముందుగా పహల్గామ్ లో ముష్కరుల దాడిలో చనిపోయిన వారికి నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఇలాంటి హింసాత్మక ఘటనలను నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఈ క్షణం లో నేను ఒక విషయం పట్ల మీ అందరికీ క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను. గత రెండు రోజులుగా సోషల్ మీడియా లో నాపై వస్తున్న రూమర్స్ గమనించాను. నా కుటుంబం లో ఎవ్వరికీ కూడా పాకిస్థాన్ మిలటరీ తో సంబంధం లేదు. ఇలాంటి అసత్యపు ప్రచారాలు చేసి నాపై ద్వేషాన్ని పెంచాలని అనుకోవడం బాధాకరం. నేను ఇండో అమెరికన్ అమ్మాయిని అని గర్వం గా చెప్పుకుంటున్నాను. నాకు తెలుగు, హిందీ, గుజరాతి, ఇంగ్లీష్ భాషలు వచ్చు. మా తల్లిదండ్రులు చట్టపరంగా యునైటెడ్ స్టేట్స్ కి వాళ్ళు యుక్త వయసులో ఉన్నప్పుడే వలస వచ్చారు’.
‘నేను లాస్ ఏంజిల్స్ లో పుట్టాను. అమెరికన్ సిటిజెన్ గా పెరిగిన నేను, అక్కడే యూనివర్సిటీ లో విద్యాబ్యాసం పూర్తి చేశాను. ఆ తర్వాత నేను యాక్టింగ్, డ్యాన్సింగ్ లో శిక్షణ తీసుకున్నాను. అలా ఆడిషన్స్ చేస్తున్న సమయంలో నాకు సినిమాల్లో అవకాశాలు రావడం మొదలు పెట్టింది. దయచేసి మీకు ఇష్టమొచ్చిన వార్తలు ప్రచారం చేసి విద్వేషాలను రెచ్చగొట్టకండి. జరిగిన ఈ దుర్ఘటన సమయంలో మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేసి, వాళ్ళ ఆత్మలు శాంతిని కోరుకోవాలని ప్రార్థించండి. ప్రేమని పంచాల్సిన అతి ముఖ్యమైన సమయంలో ద్వేషాన్ని వ్యాప్తి చేయకండి’ అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ చిత్ర షూటింగ్ లో ఈమె గత కొంతకాలం నుండి పాల్గొంటుంది. పాకిస్తానీయులు ఇండియాలో ఉండరాదు అని నిన్న ప్రధానమంత్రి ఆదేశాలు ఇవ్వడంతో ఈ చర్చ తెరపైకి వచ్చింది.
Also Read : ప్రభాస్ ఫౌజీ లో ఊహించని విలన్ ను తీసుకువస్తున్నారా..? ఇంతకీ ఎవరతను..?