Bhopal : ఏదీ తనంత తానై నీ దరికి రాదు.. శోధించి సాధించాలి అని చెప్పారు శ్రీశ్రీ. ఊరికే వచ్చినది ఎక్కువ కాలం నిలవదు అనే భావన కూడా ప్రజల్లో ఉంది. కానీ,, గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డు పక్కన వదిలేసిన కార్‌లో 52 కేజీల బంగారం రూ.11 కోట్ల నగదు లభించింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పది గంటలుగా రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారులో బంగారంతోపాటు నగదు ఉండడం, అది ఎవరికీ కనిపించకుండా తస్కరించడం గమనార్హం.
ఏం జరిగిందంటే..
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని కుశాల్ప్‌రా రోడ్డులో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఓ ఎస్‌యూవీలో రూ.40 కోట్ల విలువైన 52 కిలోల బంగారం, రూ.11 కోట్లకుపైగానగదును ఆదాయపు పన్ను శాఖ, పోలీసులు శుక్రవరం(డిసెంబర్ 20న) స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన కారు గ్వాలియర్ వాసిపేరిటంది. శుక్రవారం వేకువ జామున 2 గంటల సమయంలో కుశాల్‌పురా రోడ్డుపక్కన నిలిపిన కారులో బ్యాంగులు ఉన్నాయి. అందులో ఎవరూ లేకపోవడంతో పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు స్థానికులు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు.
మధ్య ప్రదేశ్ వాహనం..
కారును పరిశీలించిన పోలీసులు రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా అది మధ్యప్రదేశ్‌కు చెందిన కారుగా గుర్తించారు. నాలుగేళ్లుగా భోపాల్‌లో నివసిస్తున్న గ్వాలియర్‌కు చెందిన చందన్‌సింగ్‌గౌర్ పేరుతో రిజిస్టర్ అయి ఉంది. కారులోని బ్యాగులను పరిశీలించగా అందులో బంగారం, నగదు కనిపించాయి. దీంతో ఈ సొమ్ము ఎవరికి చెందుతుందని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈడీ, ఐటీ దాడులతోనే..
రాష్ట్రంలో ఈడీ, ఐటీతోపాటు లోకాయుక్త కూడా అక్రమ వ్యాపారాలపై దాడులు చేస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని, పన్ను ఎగవేస్తున్నారని సమాచారంతో ఈ దాడులు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే కారులు బంగారం, నగదు పట్టుబడడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ సొమ్ము కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులదే అయి ఉంటుందని అనుమానిస్తున్నారు.