https://oktelugu.com/

Chiranjeevi : ఆ డైరెక్టర్ పక్కన చిరంజీవి… ఫ్యాన్స్ గుండెల్లో హడల్!

ఆయన చిరంజీవితో సపరేట్ గా దిగిన ఫోటో వైరల్ గా మారింది. దీంతో కొందరు నెటిజన్లు .. అయ్యా వద్దయ్యా మా చిరంజీవిని వదిలేయ్. బాస్... మెహర్ రమేష్ కి దూరంగా ఉండండి, అంటూ పలు కామెంట్స్ చేస్తున్నారు.

Written By:
  • S Reddy
  • , Updated On : April 15, 2024 / 12:22 PM IST
    Follow us on

    Chiranjeevi : దర్శకుడు మెహర్ రమేష్ ఖాతాలో ఇప్పటి వరకు ఒక్క బ్లాక్ బస్టర్ లేదు. భారీ డిజాస్టర్లు మాత్రం ఉన్నాయి. కన్నడలో ఒకటి రెండు హిట్ చిత్రాలు చేశారు. అవి కూడా రీమేక్స్. తెలుగులో మాత్రం చెప్పుకోదగ్గ విజయాలు లేవు. మెహర్ రమేష్ వరుస ఫ్లాప్స్ ఇవ్వడంతో ఆయా హీరోల అభిమానుల నుంచి విపరీతమైన ట్రోలింగ్ కి గురయ్యాడు. తాజాగా మెహర్ రమేష్ ని మరలా టార్గెట్ చేశారు నెటిజన్స్.

    మెగా స్టార్ చిరంజీవితో మెహర్ రమేష్ కలిసి దిగిన ఫోటో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఈ ఫోటో చూసిన మెగాస్టార్ అభిమానులు షాక్ అవుతున్నారు. మెహర్ రమేష్ ని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. శక్తి, షాడో వంటి డిజాస్టర్స్ తర్వాత మెహర్ రమేష్ కి చాలా గ్యాప్ వచ్చింది. తన టాలెంట్ నిరూపించుకునేందుకు ఒక మంచి అవకాశం దొరికింది. మెగాస్టార్ చిరంజీవి అతనికి ఛాన్స్ ఇచ్చారు. దీంతో చిరంజీవి ఫ్యాన్స్ ఆందోళన చెందారు. మెహర్ రమేష్ ట్రాక్ రికార్డు తెలిసి కూడా ఎందుకు అవకాశం ఇచ్చారు? అంటూ ఫైర్ అయ్యారు.

    అంతా ఊహించినట్లే భోళా శంకర్ మూవీ ఫ్లాప్ అయింది. చిరంజీవి కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. దీంతో చిరంజీవి ఫ్యాన్స్ దర్శకుడు మెహర్ రమేష్ ను దారుణంగా ట్రోల్ చేశారు. అతని పై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఆ సినిమా తర్వాత మెహర్ రమేష్ ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు తో సినిమా తీస్తా, పవన్ కళ్యాణ్ తో తీయాల్సి ఉందని వ్యాఖ్యలు చేశారు. దీంతో అభిమానులు .. వద్దు బాబు మా హీరోని వదిలేయ్ అంటూ ట్రోల్ చేశారు.

    ఇక ఇటీవల మెహర్ రమేష్ విశ్వంభర సెట్స్ లో చిరంజీవితో కలిసి ఫోటో దిగారు. తెలుగు డైరెక్టర్స్ అసోసియేషన్ తరపున పలువురు దర్శకులు చిరంజీవి ని కలవడానికి వెళ్లారు. వారితో పాటు మెహర్ రమేష్ కూడా వెళ్లారు. ఆయన చిరంజీవితో సపరేట్ గా దిగిన ఫోటో వైరల్ గా మారింది. దీంతో కొందరు నెటిజన్లు .. అయ్యా వద్దయ్యా మా చిరంజీవిని వదిలేయ్. బాస్… మెహర్ రమేష్ కి దూరంగా ఉండండి, అంటూ పలు కామెంట్స్ చేస్తున్నారు.