https://oktelugu.com/

Family Star Collections: ఫ్యామిలీ స్టార్ కలెక్షన్స్… విజయ్ దేవరకొండ హిట్ కొట్టాలంటే ఇంకా ఎన్ని కోట్లు రావాలంటే?

విజయ్ దేవరకొండ, దిల్ రాజులను టార్గెట్ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారనే వాదన వినిపించింది. నెగిటివ్ టాక్ నేపథ్యంలో ఫ్యామిలీ స్టార్ వసూళ్లు ఓ మోస్తరుగా ఉన్నాయి.

Written By:
  • S Reddy
  • , Updated On : April 15, 2024 / 12:36 PM IST

    Family Star Movie Box Office Collections

    Follow us on

    Family Star Collections: విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న విడుదల చేశారు. దర్శకుడు పరశురామ్ తెరకెక్కించగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. దిల్ రాజు నిర్మాత. ఫ్యామిలీ స్టార్ మొదటి షో నుండే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే విజయ్ దేవరకొండ, దిల్ రాజులను టార్గెట్ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారనే వాదన వినిపించింది. నెగిటివ్ టాక్ నేపథ్యంలో ఫ్యామిలీ స్టార్ వసూళ్లు ఓ మోస్తరుగా ఉన్నాయి.

    ఫ్యామిలీ స్టార్ మూవీ చెప్పుకోదగ్గ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. నైజాం హక్కులు రూ. 14 కోట్లకు అమ్మారు. సీడెడ్ రూ. 4.5, ఆంధ్రా రూ. 17 కోట్లకు అమ్మారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఫ్యామిలీ స్టార్ రూ. 34 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి వరల్డ్ వైడ్ ఫ్యామిలీ స్టార్ థియేట్రికల్ హక్కులు రూ. 44 కోట్లకు అమ్మారని ట్రేడ్ వర్గాల సమాచారం. రూ. 45 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఫ్యామిలీ స్టార్ థియేటర్స్ లోకి వచ్చింది.

    ఇక ఫ్యామిలీ స్టార్ చిత్ర వసూళ్లు పరిశీలిస్తే.. ఏపీ/తెలంగాణలలో కలిపి ఫస్ట్ డే రూ. 7 కోట్లు వసూలు చేసింది. రెండో రోజు రూ. 3 కోట్లు, మూడో రోజర్ ఉ. 4 కోట్లు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఫ్యామిలీ స్టార్ రూ. 20 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఓవర్సీస్ లో ఫ్యామిలీ స్టార్ చిత్రానికి రెస్పాన్స్ చాలా బాగుంది. దాదాపు రూ. 10 కోట్ల వసూళ్లు రాబట్టింది. అక్కడ బ్రేక్ ఈవెన్ అయినట్లే అని సమాచారం.

    ఇప్పటివరకు ఫ్యామిలీ స్టార్ రూ. 21 కోట్ల షేర్, రూ. 30 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఫ్యామిలీ స్టార్ టార్గెట్ ఇంకా చాలా దూరంలో ఉంది. 50% మాత్రమే రికవరీ అయ్యింది. అయితే ఫ్యామిలీ స్టార్ కి బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీ లేదు. టిల్లు స్క్వేర్ మాత్రమే థియేటర్స్ లో సందడి చేస్తుంది. ఇది ఫ్యామిలీ స్టార్ కి కలిసొచ్చే అంశం. ఏప్రిల్ 17న శ్రీరామనవమి హాలిడే ఉంది. కాబట్టి ఫ్యామిలీ స్టార్ పుంజుకునే అవకాశం లేకపోలేదు. నెగిటివ్ రివ్యూలు చిత్రాన్ని దెబ్బ తీశాయి. లేదంటే వసూళ్లు ఇంకొంచెం మెరుగ్గా ఉండేవి…