Mahesh Babu : ప్రస్తుతం ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క నటుడు రాజమౌళి డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు. కారణం ఏదైనా కూడా ఆయన సినిమాలో నటిస్తే భారీ గుర్తింపు రావడమే కాకుండా వాళ్ళ మార్కెట్ కూడా పెరుగుతుందనే ఉద్దేశ్యంతోనే వాళ్ళు ఇలాంటి ఒక అంచనాలో ఉన్నట్టుగా తెలుస్తోంది…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న డైరెక్టర్ రాజమౌళి… ఆ తర్వాత పాన్ ఇండియా సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటికే ఆయన చేసిన బాహుబలి సినిమాతో మంచి క్రేజ్ ను సంపాదించుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకున్నాడు.ఇక ఇప్పుడు ఆయన యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ దర్శకుడి గా కొనసాగుతున్నాడు. ఇక ఇప్పుడు పాన్ వరల్డ్ లో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. నిజానికి మహేష్ బాబు లాంటి స్టార్ హీరోని పెట్టి పాన్ ఇండియా సినిమా చేయడం అనేది రాజమౌళికే చెల్లుతుంది. ఆయన ఎంత ఖర్చు పెట్టినా కూడా అంతకుమించి వసూళ్లను రాబట్టడంలో ఆయన సిద్ధహస్తుడనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలోనే ‘త్రిబుల్ ఆర్’ సినిమా ఇండస్ట్రీ రికార్డును బ్రేక్ చేస్తుంది అని అందరు అనుకున్నారు. కానీ ఆ సినిమాలో ఎక్కడో కొంచెం లెక్క అయితే తప్పింది. దానివల్ల ఆ సినిమా 1300 కోట్ల కలెక్షన్స్ ను మాత్రమే సంపాదించింది.
మరి ఇప్పుడు రాబోతున్న ఈ సినిమాతో బాహుబలి 2 సినిమా రికార్డును బ్రేక్ చేయాలని రాజమౌళి చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం ఏకంగా 1200 కోట్ల బడ్జెట్ ని కేటాయిస్తున్నారు.
ఇక ఈ సినిమా దాదాపు 3,000 కోట్ల వరకు కలెక్షన్లను రాబడుతుంది అంటూ రాజమౌళి మొదటి నుంచి కూడా చాలా మంచి కాన్ఫిడెంట్ గా ఉంటున్నాడు… ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి నుంచి ఒక సినిమా వస్తుందంటే ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లో కూడా భారీ మార్కెట్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక ఇప్పుడు ఆయన హాలీవుడ్ డైరెక్టర్లకు పోటీని ఇచ్చే విధంగా ఈ సినిమాని రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు అభిమానులు మాత్రం రాజమౌళికి దండం పెడుతున్నారనే చెప్పాలి.
ఎందుకు అంటే తమ హీరోని అనవసరంగా ఇన్ని సంవత్సరాలపాటు లాక్ చేసి ఉంచడం దేనికి ఈ గ్యాప్ లో ఆయన మరొక సినిమా చేసుకోవచ్చు కదా సంవత్సర కాలం పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తూనే ఉన్నారు. ఇక మహేష్ బాబు టూర్లకు తిరగడం, రాజమౌళి సినిమాలో క్యారెక్టర్ కి తగ్గట్టుగా మేకోవర్ అవ్వడం తప్ప ఆయన ఈ మధ్యకాలంలో చేసింది ఏదీ లేదు అంటూ తన అభిమానులు రాజమౌళి మీద కొంతవరకు కోపాన్ని వెల్లబుచ్చుతూనే తమ హీరోతో సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో చిన్న అప్డేట్ ఇవ్వమని రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు…