NTR : సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి మధ్య సినిమాలపరంగా చాలా పోటీ అయితే ఉంటుంది. ఇక పర్సనల్ విషయాల్లో వీళ్లంతా కలిసి మెలిసి ఉన్నప్పటికి సినిమాలు చేయడంలో ఎవరు విజయాన్ని అందుకుంటారు. ఎవరి మీద ఎవరు పై చేయి సాధిస్తారు అనే దాని మీదనే సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ఇక ఎట్టకేలకు రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ అటు నందమూరి ఇటు మెగా అభిమానులను సంతృప్తి పరచడానికి ఎన్టీఆర్, రామ్ చరణ్ ను పెట్టి ‘త్రిబుల్ ఆర్ ‘ అనే సినిమా చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు…
తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పటివరకు చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. మరి వాళ్ళు చేసే మంచి సినిమాలు ఇండస్ట్రీలో గొప్ప విజయాలను సాధించడమే కాకుండా వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకోవడంలో సహాయ పడుతున్నాయి… ఇక ఇదిలా ఉంటే నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తక్కువ సమయంలోనే భారీ సక్సెస్ లను సాధించి మాస్ హీరోగా ఎదిగాడు. ఇక ‘యంగ్ టైగర్’ గా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. మరి ఇలాంటి హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలుతాడు అని అందరూ అనుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల ఆయనకు వరుసగా ప్లాపులు రావడంతో ఆయన కెరియర్ అనేది కొంతవరకు డౌన్ అయిపోయిందనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలో ఆయనకు ఇతర హీరోల నుంచి భారీ పోటీ ఎదురవ్వడంతో ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా హీరోగా కొనసాగుతున్నప్పటికి టాప్ ప్లేస్ లో అయితే లేడనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే మెగా స్టార్ కొడుకు అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.
ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చేసిన సినిమాలు చాలా అద్భుతంగా ఉండేవి. వాటిలో రామ్ చరణ్ కి కొన్ని సినిమాలు అంటే చాలా ఇష్టమట…ఇక అందులో ఒకటి ‘అదుర్స్ ‘ కాగా, రెండు ‘బృందావనం ‘ ..ఈ రెండు సినిమాలు అంటే రామ్ చరణ్ కి చాలా ఇష్టమని ఆయన ఇంతకుముందు చాలా సందర్భాల్లో తెలియజేశాడు…
ఇక రామ్ చరణ్ కి ఎన్టీఆర్ కి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉన్న విషయం మనకు తెలిసిందే. వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన ‘త్రిబుల్ ఆర్’ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. ఇక దాంతో రామ్ చరణ్ కూడా గ్లోబల్ స్టార్ గా అవతరించాడు. ఎన్టీఆర్ పాన్ ఇండియాలో భారీ మార్కెట్ ను క్రియేట్ చేసుకోగలిగాడు.
ఇక రీసెంట్ గా కొరటాల శివ డైరెక్షన్ లో చేసిన ‘దేవర ‘ సినిమాతో మంచి విజయాన్ని సాధించినప్పటికి కలెక్షన్ల రూపంలో మాత్రం ఆయనకు కొంతవరకు చేదు అనుభవం ఎదురైందనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో ఇద్దరు హీరోలు పోటీ పడుతూ ముందుకు దూసుకెళ్తున్నారు…